వేసవిలో కీరదోస తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో నీరు పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు
TV9 Telugu
కీరదోసలో 90 శాతం నీరు, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి
TV9 Telugu
కీరదోస అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకుంటారు. కొందరు కీర దోస సలాడ్‌ను పెరుగుతో కలిపి రైతా తయారు చేస్తారు. మరికొందరు సాండ్‌విచ్‌లో వేసి తినడానికి ఇష్టపడతారు
TV9 Telugu
అయితే ఏదైనా అతిగా తింటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ విషయంలో కీరదోసకు ఎలాంటి మినహాయింపులు లేవు
TV9 Telugu
వేసవిలో కీరదోస తినడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా అన్నారు. కానీ దీనిని మీ శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే తినాలి
TV9 Telugu
ఆరోగ్యాంగా ఉండాలంటే రోజుకు 2 నుండి 3 దోసకాయలు తినడం మంచిది. వీటిని సలాడ్‌లా లేదంటే నేరుగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది
TV9 Telugu
అయితే ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొందరికి కీరదోస తిన్న తర్వాత ఆమ్లత్వం, త్రేనుపు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వారు పరిమితంగానే తీసుకోవాలి
TV9 Telugu
చాలా మందికి ఉదయం ఖాళీ కడుపుతో కీరదోస తినడం అలవాటు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మంచిది కాదు. కొంతమందికి ఖాళీ కడుపుతో తినడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది