పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత..వీడియో
మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. పది రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకొని కాబోయే అల్లుడితో అత్త ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ మహిళ నిర్వాహకం తెలిసి సభ్యసమాజం విస్తుపోయింది. మరో ఘటనలో భర్తను ప్రేమికుడితో కలిసి హత్య చేసిన భార్య పాముకాటు కథతో మోసం చేయబోయిన ఘటన యూపీ మీరట్ లో కలకలం రేపింది. పోస్ట్ మార్టం నివేదికతో అసలు నిజం వెలుగులోకి వచ్చి ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. తాజాగా మరో ఘటన జరిగింది. పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో ఆ వరుడు బిత్తరపోయాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నిరాకరించాడు. అత్యాచారం కేసు పెడతామని బెదిరించినా భయపడలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పెళ్లికోసం తాను భార్యకు ఖర్చు చేశానని ఇప్పుడు మోసం వల్ల తన పెళ్లి ఆగిపోయిందని ఫిర్యాదులో తెలిపాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని బ్రహ్మపురిలో ఈ విచిత్ర ఘటన జరిగింది. మీరట్ లోని బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీంకు షామలి జిల్లా వాసి మంతషా తో పెళ్లి కుదిరింది. నికా సమయంలో మౌల్వి వధువు పేరును తాహిరా అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా మంతషాకు బదులుగా భర్త చనిపోయిన 45 ఏళ్ళ ఆమె తల్లి వధువు వేషధారణలో కూర్చుని ఉంది. దాంతో పెళ్లి కొడుకు బిత్తరపోయాడు. మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో వరుడి అన్నావదినలు అతడి నోరుమూయించేందుకు విఫలయత్నం చేశారు. నోరుమూసుకొని పెళ్లికూతురు తల్లిని వివాహం చేసుకోకపోతే అత్యాచారం కేసు పెడతామని వరుడి అన్నావదినలు బెదిరించారు. ఎందుకంటే ఈ పెళ్లికి వరుడి తరపున పెద్దలుగా వ్యవహరించిన అతడి అన్నావదినలు అప్పటికే వధువు కుటుంబంతో కుమ్మక్కయ్యారు. అందుకే అల్లరి చేయకుండా పెళ్లి చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను పూర్తిగా మోసపోయాడని గ్రహించిన అజీం నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పెళ్లికోసం తాను ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం :
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

