Diabetes: బ్లడ్‌ షుగర్‌ని నియంత్రించే అద్భుత ఆయుర్వేద మూలికలు..! వీటిని తింటే మధుమేహం మీ కంట్రోల్‌ల్లోనే..?

|

Apr 21, 2024 | 7:08 AM

సీజన్లు మారుతున్నప్పుడు, ఖచ్చితంగా మీ ఆహార ప్రణాళికను కూడా మార్చుకోండి. సీజనల్ పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మీకు అన్ని పోషకాలను అందిస్తాయి. సరైన ఆహారంతో పాటు కొన్ని మూలికలను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. వాటిని మీ రోజువారీ ఆహారంలో వివిధ మార్గాల్లో చేర్చుకోవచ్చు. ఆ అద్భుత మూలికలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

Diabetes: బ్లడ్‌ షుగర్‌ని నియంత్రించే అద్భుత ఆయుర్వేద మూలికలు..! వీటిని తింటే మధుమేహం మీ కంట్రోల్‌ల్లోనే..?
Blood Sugar Control In Ayurveda
Follow us on

మధుమేహం.. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇబ్బంది పెడుతున్న ఒక ఆరోగ్య సమస్య. ఒక్కసారి షుగర్‌ ఎటాక్‌ చేసిందే అది ఆ వ్యక్తిని జీవితాంతం వదిలిపెట్టకుండా అతనితో పాటు ఉంటుంది. డయాబెటిక్‌ బాధితుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. నేటి అనారోగ్యకర జీవనశైలి కారణంగా ఈ వ్యాధి వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల జీవనశైలి విధానమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దీనితో పాటు, యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగిన సహజ పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

మధుమేహాన్ని నియంత్రించడానికి ఆయుర్వేదంలో కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి.. ఈ నియమాల సహాయంతో మీరు మధుమేహాన్ని నియంత్రించవచ్చు . వాతావరణ మార్పులతో పాటు, రోజువారీ దినచర్యలు కూడా మారుతున్నాయి. మారుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాతావరణం మార్పుల నేపథ్యంలో ప్రజలు తమ దినచర్య, ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. మీ ఆహారాన్ని మార్చుకోవడం వలన మీరు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, వ్యాధి నుండి మీ శరీరాన్ని రక్షించుకోవచ్చు. సీజన్లు మారుతున్నప్పుడు, ఖచ్చితంగా మీ ఆహార ప్రణాళికను కూడా మార్చుకోండి. సీజనల్ పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మీకు అన్ని పోషకాలను అందిస్తాయి. సరైన ఆహారంతో పాటు కొన్ని మూలికలను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. వాటిని మీ రోజువారీ ఆహారంలో వివిధ మార్గాల్లో చేర్చుకోవచ్చు. ఆ అద్భుత మూలికలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

– ఉసిరి కాయ లేదంటే, ఎండిన ఉసిరి పొడి

ఇవి కూడా చదవండి

– అల్లనేరెడు పండ్లు, లేదంటే దాని గింజల పొడి

– తులసి ఆకులు

-తిప్పతీగ

– మెంతులు, మెంతికూర, మెంతి గింజల పొడి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..