Chanakya Niti: వైవాహిక జీవితంలో ఆలుమగలు చేయకూడని తప్పులివే.. చేస్తే కాపురంలో చేజేతులా నిప్పులు పోసుకున్నట్లే..

|

Sep 10, 2023 | 10:07 PM

Chanakya Niti: చాణక్యుడు వైవాహిక జీవితంలో తరచూ వచ్చే సమస్యలను అధిగమించేందుకు కూడా సలహాలు ఇచ్చాడు. చాణక్యుడి సూచనల ప్రకారం వైవాహిక జీవితంలో భార్యభర్తలు కొన్ని రకాల తప్పులను చేయకూడదని, వాటిని చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంతకీ భార్యభర్తలు చేయకూడదని చాణక్యుడు పేర్కొన్న ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు..

Chanakya Niti: వైవాహిక జీవితంలో ఆలుమగలు చేయకూడని తప్పులివే.. చేస్తే కాపురంలో చేజేతులా నిప్పులు పోసుకున్నట్లే..
Chanakya Niti
Follow us on

Chanakya Niti: రాజనీతి కోవిదుడు, మేధావి అయిన ఆచార్య చాణక్యుడు ఎన్నో శాస్త్రాల్లో పండితుడు. మనిషి తన జీవితంలో ఎదురయ్యే రోజువారీ సమస్యలను ఎలా అధిగమించాలో చక్కగా వివరించాడు చాణక్యుడు.  ఈ కారణంగానే చాణక్యుడు సూచించిన నీతి సూత్రాలను నేటికీ పాటించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అర్థిక సమస్యలను అధిగమించడానికి, విజయం సాధించడానికి, పురోగతి సాధించడానికి పరిష్కార మార్గాలను సూచించిన చాణక్యుడు వైవాహిక జీవితంలో తరచూ వచ్చే సమస్యలను అధిగమించేందుకు కూడా సలహాలు ఇచ్చాడు. చాణక్యుడి సూచనల ప్రకారం వైవాహిక జీవితంలో భార్యభర్తలు కొన్ని రకాల తప్పులను చేయకూడదని, వాటిని చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంతకీ భార్యభర్తలు చేయకూడదని చాణక్యుడు పేర్కొన్న ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. హెచ్చుతగ్గుల భావన:  ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు సమానంగా జీవిస్తున్నారు. అయినా కొందరు పురుషులు తామే ఎక్కువ అనే భావనతో తమ భార్యపై అధిపత్యం చెలాయంచే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆలుమగలు సమాన భావనతో జీవించినప్పుడే కాపురం సజావుగా సాగుతుందని చాణక్యుడు వివరించాడు.
  2. ఖర్చు: కష్టాలు లేకుండా జీవితాన్ని సక్రమంగా గడపాలంటే డబ్బు చాలా అవసరం. అయితే ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉన్నప్పుడే .. వారిరువురి మధ్య సంబంధం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి డబ్బు విషయంలో రహస్యంగా ఉంటే.. బంధంపై చెడు ప్రభావం పడి, నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి భార్యభర్తలు ఇద్దరూ చర్చించుకుని ఖర్చు చేయడం మంచిదని చాణక్యుడు సూచించాడు.
  3. గౌరవం: ఏ బంధం అయినా ఆరోగ్యంగా ఉండాలంటే పరస్పర గౌరవ భావం చాలా ముఖ్యం. ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఈ భావన తప్పక ఉండాలి. భార్యభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించకపోయినా సమస్యలకు కారణం కాగలదు. కాబట్టి పరస్పర గౌరవంతో మెలగాలని చాణక్యుడు పేర్కొన్నాడు.
  4. కోపం: ముందుగా చెప్పుకున్నట్లు భార్యాభర్తల మధ్య బంధం ఆరోగ్యంగా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు కోపాన్ని ప్రయోగించకుండా ఉండడం కూడా తప్పనిసరి. కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే బంధం బలహీనపడుతుంది. కోపం వచ్చేలా తమ జీవిత భాగస్వామి తప్పు చేసినా.. తనకు అర్థమయ్యేలా వివరించి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది.

Note: ఇక్కడ తెలిపిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ సమాచారాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాము.