Dengue: డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో దోమకాటు బారిన పడుతున్నారు. ఈ కారణంగా శరీరంలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు...

Dengue: డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..
Dengue
Follow us

|

Updated on: Oct 10, 2024 | 5:08 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో దోమకాటు బారిన పడుతున్నారు. ఈ కారణంగా శరీరంలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ బారిన పడిన పడితే కొన్ని రకాల ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డెంగ్యూ బారిన పడిన వారు స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డెంగ్యూ బారినపడినవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఇది జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకుంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణంకాక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

డెంగ్యూతో బాధపడుతున్న వారు ఆయిల్‌ ఫుడ్‌ను కూడా పూర్తిగా తగ్గించేయాలి. ఇది రోగి జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపుతుంది. నూనె ఎక్కువగా ఉన్న ఆహారంలో తినడం వల్ల చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. అలాగే కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీలకు సైతం దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు పడాలి. ఇందుకోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటివి ఫుడ్‌ మెనూలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల రోగి డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..
డెంగ్యూ బారిన పడ్డవారు.. ఈ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి..
టీమిండియా సెమీస్ రూట్.. ఆసీస్‌పై గెలిచినా, ఆ రెండు జట్లపైనే చూపు
టీమిండియా సెమీస్ రూట్.. ఆసీస్‌పై గెలిచినా, ఆ రెండు జట్లపైనే చూపు
సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబల్ బహుమతి..
సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబల్ బహుమతి..
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఏంటో తెలుసా?
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఏంటో తెలుసా?
మూడు శుభ గ్రహాల మార్పు.. ఇక ఆ రాశుల వారికి అంతా శుభమే!
మూడు శుభ గ్రహాల మార్పు.. ఇక ఆ రాశుల వారికి అంతా శుభమే!
TV9 ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా..ఆకట్టుకోనున్న మ్యూజిక్ పెర్ఫార్మెన్స్
TV9 ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా..ఆకట్టుకోనున్న మ్యూజిక్ పెర్ఫార్మెన్స్
హాలిడేస్ లో షూటింగ్స్ హంగామా.! మన హీరోలకి మాత్రం సెలవలు లేనట్టేనా
హాలిడేస్ లో షూటింగ్స్ హంగామా.! మన హీరోలకి మాత్రం సెలవలు లేనట్టేనా
Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు..
Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు..
లోబీపీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?
లోబీపీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..ఆ ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..ఆ ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్