Cell Phone Side Effects: రోజుకు నాలుగు గంటలపైనే ఫోన్ వాడుతున్నారా.. ప్రాణానికే ప్రమాదం!

| Edited By: Shaik Madar Saheb

Dec 10, 2023 | 9:20 PM

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు. ఇక చిన్నారులకు అయితే ఫోన్ పెట్టకపోతే తిండి కూడా తినడం లేదు. ఏడిస్తే ఫోన్.. తినాలంటే ఫోన్ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫోనే ప్రపంచమే లోకమైంది. ఆఖరికి బాత్ రూమ్ కి వెళ్లాలన్నా సెల్ ఫోన్ లేకుండా వెళ్ల లేకపోతున్నారు. ఇలా రోజు రోజుకూ స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి పోతుంది. దీని వల్ల మనిషి.. సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు. కాస్త ఖాళీగా సమయం దొరికితే చాలు..

Cell Phone Side Effects: రోజుకు నాలుగు గంటలపైనే ఫోన్ వాడుతున్నారా.. ప్రాణానికే ప్రమాదం!
Cellphone
Follow us on

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు. ఇక చిన్నారులకు అయితే ఫోన్ పెట్టకపోతే తిండి కూడా తినడం లేదు. ఏడిస్తే ఫోన్.. తినాలంటే ఫోన్ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫోనే ప్రపంచమే లోకమైంది. ఆఖరికి బాత్ రూమ్ కి వెళ్లాలన్నా సెల్ ఫోన్ లేకుండా వెళ్ల లేకపోతున్నారు. ఇలా రోజు రోజుకూ స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి పోతుంది. దీని వల్ల మనిషి.. సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు. కాస్త ఖాళీగా సమయం దొరికితే చాలు.. మనుషులతో మాట్లాడటం మానేసి.. సెల్ ఫోనే చూస్తున్నారు.

కానీ ఫోన్ వినియోగం వల్ల ఆరోగ్యంపై ఎంత ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచన మాత్రం ఎవరూ చేయడం లేదు. సెల్ ఫోన్ పై తాజాగా జరిగిన పరిశోధనలో మరిన్ని ఆసక్తి కర విషయాలు బయట పడ్డాయి. కౌమార దశలో ఉండే వారు ప్రతి రోజూ 4 గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ చూస్తే.. మానిసికంగా ఒత్తిడి, డిప్రెషన్ లోకి వెళ్తాయని దీంతో నిద్ర సమస్యలు, కంటి సమస్యలే కాకుండా పలు సమస్యలకు దారి తీస్తాయని తేలింది.

సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్:

కౌమార దశలో ఉండే వారు స్మార్ ఫోన్ ని వినియోగించడంపై కొరియాలోని హన్యాంగ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ బృందం పలు పరిశోధనలు చేశారు. ఇందులో 50 వేల కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు. ఈ దశలో ఉండే వారు రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేయడం వల్ల వారిలో ఒత్తిడి, ఆత్మహత్య, ఆలోచనలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటివి ఎక్కువగా ఉందని తేలింది. ఫోన్ ని తక్కువగా వినియోగించే వారిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

దృష్టి లోపం ఏర్పడుతుంది:

ఫోన్ అతిగా ఉపయోగిస్తే నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే సరిగా నిద్ర పట్టదు. దీంతో మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఫోన్ లైట్ ఎక్కువగా కంటిపై పడితే.. నిద్ర లేమి సమస్యల వస్తుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫోన్ చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడి బారిపోవడం, తల నొప్పి, నీరసం, అలసట, వంటివి ఎటాక్ చేస్తాయి. దీని వలన కంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. రోజంతా ఫోన్ ఉపయోగిస్తే మెడ, వెన్నుముక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి సెల్ ఫోన్ ఉపయోగించే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.