Back Pain: వెన్ను నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ టిప్స్‌తో దెబ్బకు తగ్గాల్సిందే..

| Edited By: Janardhan Veluru

Jul 29, 2024 | 2:52 PM

చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో పెద్దలు, పిల్లలు కూడా వెన్ను నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం, నిలుచును ఉండటం, నడవడం వల్ల వెన్ను నొప్పి అనేది వస్తుంది. అంతేకాదు మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేని కారణంగా కూడా ఈ నొప్పి అనేది వస్తుంది. సడెన్‌గా ఒక్కసారిగా ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పి వచ్చిందంటే..

Back Pain: వెన్ను నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ టిప్స్‌తో దెబ్బకు తగ్గాల్సిందే..
గంటల తరబడి ఒకేచోట పనిచేయడం వల్ల వెన్నుపాము నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. కానీ కొంతమందిలో ఇది చాలా కాలం పాటు కొనసాగుతుంది. దీనివల్ల ఏ పని చేయాలన్నా ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది వెన్నెముక నొప్పిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వెన్నెముక కూడా దెబ్బతింటుంది. దీని కారణంగా హెర్నియేటెడ్ డిస్క్, వెన్నునొప్పి, పార్శ్వగూని వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
Follow us on

చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో పెద్దలు, పిల్లలు కూడా వెన్ను నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం, నిలుచును ఉండటం, నడవడం వల్ల వెన్ను నొప్పి అనేది వస్తుంది. అంతేకాదు మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేని కారణంగా కూడా ఈ నొప్పి అనేది వస్తుంది. సడెన్‌గా ఒక్కసారిగా ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పి వచ్చిందంటే అస్సలు భరించలేం.

వెన్ను నొప్పికి లక్షణాలు:

వెన్ను నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కండరాలు, ఎముకలు, కడుపులో ఏదైనా సమస్య ఉంటే నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. టూ వీలర్ పై ఎక్కువ దూరం ప్రయాణం చేసినా ఈ నొప్పులు వస్తాయి. పోషకాహారం లోపం, స్థూల కాయం, గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొన్నా నడుము నొప్పి అనేది వస్తుంది. వెన్ను నొప్పి సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాకింగ్ చేయాలి:

ప్రతి రోజూ ఓ అరగంట సేపు వాకింగ్ చేయడం వల్ల వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల నడుము, వెన్నులోని కండరాలు మొత్తం కదులుతాయి. దీని వల్ల నడుము నొప్పి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

యోగా ఆసనాలు:

వెన్ను నొప్పిని తగ్గించుకోవడంలో యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు వేయడం వల్ల నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.

మసాజ్:

నడుము నొప్పి వచ్చిన చోట మంచి ఆయుర్వేదిక్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో తరచూ మర్దనా, మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పి నుంచి బయట పడొచ్చు. ఇలా చేయడం వల్ల నడుములోని కండరాలు ఫ్రీ అవుతాయి.

వేడి నీటితో కాపడం:

వెన్ను నొప్పి వచ్చిన చోట వేడి నీటితో కాపడం అనేది పెడుతూ ఉండాలి. వేడి నీటిలో రాళ్ల ఉప్పు కలిపి.. నొప్పి ఉన్నచోట ఓ క్లాత్ సహాయంతో కాపడం పెడుతూ ఉంటే.. నొప్పి క్రమేపీ తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..