Magnesium Foods: రాత్రిళ్లు నిద్రపట్టడంలేదా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్‌ లోపించినట్లే..

|

May 12, 2024 | 5:33 PM

నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక సతమతమవుతుంటారు. ఎప్పటికో తెల్లవారుజామున 2 గంటలకు నిద్రపట్టినా ఉదయం ఠంచన్‌గా నిద్రలేని ఆఫీస్‌లకు పరుగులు తీయాల్సి ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర పట్టకపోతే ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా మధుమేహం, డిప్రెషన్, ఊబకాయం వంటి బహుళ శారీరక సమస్యలను దాడి చేస్తాయి. వీటితోపాటు శారీరక అలసట, బలహీనత కూడా..

Magnesium Foods: రాత్రిళ్లు నిద్రపట్టడంలేదా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్‌ లోపించినట్లే..
Magnesium Foods
Follow us on

నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక సతమతమవుతుంటారు. ఎప్పటికో తెల్లవారుజామున 2 గంటలకు నిద్రపట్టినా ఉదయం ఠంచన్‌గా నిద్రలేని ఆఫీస్‌లకు పరుగులు తీయాల్సి ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర పట్టకపోతే ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా మధుమేహం, డిప్రెషన్, ఊబకాయం వంటి బహుళ శారీరక సమస్యలను దాడి చేస్తాయి. వీటితోపాటు శారీరక అలసట, బలహీనత కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీకు ఎందుకు నిద్ర రావడంలేదో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి రాత్రిపూట నిద్రపట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల కూడా నిద్ర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కండరాల ఒత్తిడి, తిమ్మిర్లు, అలసట, హృదయ స్పందన రేటులో మార్పులు, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు సంభవిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపాన్ని ఆహారం, పానీయాల ద్వారా భర్తీ చేయవచ్చు. ఏయే ఆహారాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుందంటే..

బాదం

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బాదంపప్పులో 268 mg మెగ్నీషియం ఉంటుంది. బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. ఈ విధంగా శరీరంలో మెగ్నీషియం లోపాన్ని సులభంగా పూరించవచ్చు.

గుమ్మడికాయ గింజలు

100 గ్రాముల గుమ్మడికాయ గింజలు 535 mg మెగ్నీషియంను అందిస్తాయి. అధిక రక్తపోటు చికిత్సలో గుమ్మడికాయ గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వోట్స్, పెరుగు, సలాడ్‌లో గుమ్మడికాయ గింజలను వేసుకుని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

అవకాడో

ఆరోగ్యాన్ని అవకాడో పండు ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల అవకాడోలో 29 mg మెగ్నీషియం ఉంటుంది. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. అవోకాడోలను సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, స్మూతీస్‌లలో తినవచ్చు.

పాలకూర

పాలకూర పోషకాలతో నిండి ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 79 mg మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియంతో పాటు, ఇందులో ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

క్వినోవా

చాలా మంది బరువు తగ్గడానికి క్వినోవా తింటారు. 100 గ్రాముల వండిన క్వినోవాలో 197 mg మెగ్నీషియం ఉంటుంది. ఈ ధాన్యాలలో గ్లూటెన్ కూడా ఉంటుంది. కాబట్టి క్వినోవా తినడం ద్వారా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

డార్క్ చాక్లెట్

100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 228 mg మెగ్నీషియం ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.