Heart Attack: రోజుకు 5 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారా, అయితే హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్..జాగ్రత్త…

| Edited By: Ravi Kiran

Mar 23, 2023 | 10:12 AM

రోజుకు 7 నుంచి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ గుండె ప్రమాదంలో పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్త నాళాల్లో బ్లాకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం మంచి అలవాటు.

Heart Attack: రోజుకు 5 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారా, అయితే హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్..జాగ్రత్త...
Sleeping
Follow us on

రోజుకు 7 నుంచి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ గుండె ప్రమాదంలో పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్త నాళాల్లో బ్లాకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం మంచి అలవాటు. మానసికంగా కూడా మంచ జీవితాన్ని గడపాలంటే నిద్ర చాలా అవసరం. మీరు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు, తల బరువుగా ఉండి, శరీరం బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరం, శక్తి స్థాయి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే కనీసం 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.

7 నుండి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం మీ గుండెకు ప్రమాదకరం. మీరు రోజూ కేవలం 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లయితే, దాని ప్రత్యక్ష ప్రభావం మీ గుండెకు చేరుతుంది. రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో చేతులు , కాళ్ళ ధమనుల్లో బ్లాకులు ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇది అథెరోస్క్లెరోసిస్ , లక్షణాలలో ఒకటి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్ళు, చేతుల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. సాధారణంగా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) లక్షణాలు కింది కాళ్లలో తిమ్మిరి లేదా చల్లదనం, కాళ్లలో పల్స్ బలహీనంగా ఉండటం, తుంటిలో నొప్పితో కూడిన తిమ్మిర్లు, కాళ్లలో చర్మం రంగులో మార్పులు, కాళ్లపై పుండ్లు పూర్తిగా నయం కాకపోవడం వంటివి గమనించవచ్చు.

నిద్రలేమి శరీరానికి హాని కలిగిస్తుంది:

ఇవి కూడా చదవండి

రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) ప్రమాదం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ గంటల నిద్ర ప్రతీ పది లక్షల మందిలో 53,416 మందిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD)ప్రమాదాన్ని పెంచింది. రాత్రిపూట తక్కువ నిద్ర పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) ను పెంచుతుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. అర్థరాత్రి నిద్రపోవడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఆలస్యంగా పని చేయడం, ఉదయం త్వరగా నిద్రలేవడం చాలా మందికి అలవాటుగా మారింది. తక్కువ నిద్ర, ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువసేపు నిద్రపోవడమే పరిష్కారమా?

సుదీర్ఘ నిద్రపై కూడా అధ్యయనం నిర్ధారించింది, 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) ప్రమాదాన్ని 24% పెంచుతుందని కనుగొన్నారు. అందుకే రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు గాడ్జెట్‌లను స్విచ్ ఆఫ్ చేయడం, నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఆహారం తీసుకోవడం, నిద్రపోయే ముందు బుక్ చదవడం లేదా ధ్యానం చేయడం ప్రయత్నించండి. సాయంత్రం తర్వాత టీ లేదా కాఫీని తీసుకోకండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిద్రపోకుండా చేస్తుంది.

 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి