ఆ యాపిల్స్ తింటున్నారా..! బీ కేర్‌ఫుల్
రోజుకో యాపిల్ తింటే.. వైద్యుడికి దూరంగా ఉండొచ్చు.. అని ఒకప్పుడు అనేవారు. కానీ ఇప్పుడు యాపిల్‌ను తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఆగండాగండి.. వెంటనే టెన్షన్ పడకండి. యాపిల్ తినడం నిజంగా మంచిదే. దాని వల్ల శరీరానికి కావలసిన ఎక్స్‌ట్రా ఫైబర్, ప్లావనాయిడ్స్, ఫ్లేవర‌్లు అందుతాయి. కానీ యాపిల్ పండ్లను పెంచే పద్దతిపై అవి మంచివో కావో ఆధారపడి ఉంటుంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్గానిక్ యాపిల్‌లను తినేందుకే చాలా మంది […]

రోజుకో యాపిల్ తింటే.. వైద్యుడికి దూరంగా ఉండొచ్చు.. అని ఒకప్పుడు అనేవారు. కానీ ఇప్పుడు యాపిల్‌ను తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఆగండాగండి.. వెంటనే టెన్షన్ పడకండి. యాపిల్ తినడం నిజంగా మంచిదే. దాని వల్ల శరీరానికి కావలసిన ఎక్స్‌ట్రా ఫైబర్, ప్లావనాయిడ్స్, ఫ్లేవర‌్లు అందుతాయి. కానీ యాపిల్ పండ్లను పెంచే పద్దతిపై అవి మంచివో కావో ఆధారపడి ఉంటుంది.
ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్గానిక్ యాపిల్‌లను తినేందుకే చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ఆ యాపిల్ పండ్లలోనే దాదాపు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనిపెట్టారు. ఈ బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్‌లు శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయట. 240 గ్రాములు ఉన్న ఒక్కో యాపిల్‌లో సుమారు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని అంటున్నారు. ఇంకా యాపిల్ తాజాగా ఉండడం కోసం వాడే కృత్రిమ సాధనాల వల్ల కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి యాపిల్‌కు ఫంగస్ వ్యాప్తి చేసే గుణం ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికే జరిపిన పలు రకాల యాపిల్ ఉత్పత్తుల ద్వారా నిర్ధారణ అయినట్లు కూడా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.