ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే.. ఆస్పత్రి బిల్లు తడిసి మోపెడైద్ది..

08 March 2025

Ravi Kiran

రోజూను యాక్టివ్‌గా, ఉల్లాసంగా స్టార్ట్ చేయాలంటే.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అల్పాహారంలో పౌష్టికాహారం తీసుకుంటే.. ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటారని సూచిస్తున్నారు. 

అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే శరీరంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గే ఛాన్స్ ఉందన్నారు. 

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గి అలసట, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండటమే కాదు.. జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుందట

ఉదయాన్నే టిఫిన్ తీసుకోకపోతే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి, దీనివల్ల అలసట, తలనొప్పి, చిరాకు, గందరగోళం వంటివి వస్తాయి. 

ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల పలు దుష్ప్రభావాలు ఉన్నాయని.. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. 

 బరువు పెరుగుతున్నామనో.. పని ఒత్తిడిలోనో ఉదయాన్నే ఆహారం స్కిప్ చేస్తే.. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారి తీసే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

రోజూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటే.. నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా స్టార్ట్ అవుతాయని.. అలాగే మీ మానసిక ఆరోగ్యంపై కూడా ఈ ప్రభావం పడవచ్చునని అంటున్నారు

 నిద్రలేచిన రెండు గంటలలోగా టిఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని.. అలాగే మూడుపూటల పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.