మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అమృతం లాంటి పండు కూడా విషంగా మారవచ్చు.. జాగ్రత్త!

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్ల రాజు మామిడి (Mango). తీపి రుచి, అద్భుతమైన సువాసన కలిగిన మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మామిడి పండ్లను ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను తినడానికి సరైన సమయం ఏది? వాటిని తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అమృతం లాంటి పండు కూడా విషంగా మారవచ్చు.. జాగ్రత్త!
Mango Diet Tips
Image Credit source: News 9

Updated on: Jun 03, 2026 | 12:56 PM

వేసవి కాలంలో నోరూరించే మామిడి పండ్లను తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ, వాటిని తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మామిడి పండ్లను తినేందుకు సరైన సమయం ఏంటి..? ఎవరూ మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. ఎవరు ఎంత తినాలి అనేది తప్పక తెలుసుకోవాలి. లేదంటే, అమృతంలాంటి పండు కూడా విషంగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే…

మామిడి పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లేదా మధ్యాహ్నం స్నాక్స్ సమయం (లంచ్‌కు ముందు లేదా తర్వాత 2 గంటల గ్యాప్) లో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సమయంలో తినడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. చాలా మంది భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే మామిడి పండ్లను డెజర్ట్‌గా తింటుంటారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు, చక్కెర స్థాయిలు (Blood Sugar) ఒక్కసారిగా పెరిగిపోతాయి. రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

అలాగే, మామిడి పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే తినకూడదు. వాటిని కనీసం 1 నుండి 2 గంటల పాటు చల్లటి నీటిలో నానబెట్టాలి. మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ (Phytic Acid) అనే సహజ రసాయనం ఉంటుంది, ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఆ వేడి తగ్గిపోతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, వేడి గడ్డలు, మలబద్ధకం వంటి సమస్యలు రావు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. నీటిలో బాగా కడగడం వల్ల ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ తొలగిపోతాయి. మధుమేహం (Diabetes) ఉన్నవారు మామిడి పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే పరిమితంగా తినాలి. అతిగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి.
ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతం లాంటి పండును సరైన సమయంలో, సరైన పద్ధతిలో తిన్నప్పుడే దాని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ వేసవిలో పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తూ మామిడి పండ్ల రుచిని సురక్షితంగా ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us