మీరు కూడా ఫైబర్‌ను తప్పుగా తీసుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ఫైబర్‌ కలిగిన ఆహారాన్ని తీసుకుంటారు. ఫైబర్ అనేది గుండె ఆరోగ్యం, జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని పోషకాహార ప్రపంచంలో సూపర్ స్టార్ అని పిలుస్తారు. అయితే చాలా మంది ఈ ఫైబర్‌ను సరైన విధానంలో కాకుడా ఎలా పడితే అలా తీసుకుంటారు.. ఇలా తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలను పొందడం కోల్పోతారు. కాబట్టి ఫైబర్‌ను సరైన పద్దితితో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలసుకుందాం.

మీరు కూడా ఫైబర్‌ను తప్పుగా తీసుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Fiber Benefits

Edited By: Ram Naramaneni

Updated on: Aug 15, 2025 | 6:03 PM

పోషకాహార ప్రపంచంలో ఫైబర్‌ను సూపర్ స్టార్‌గా పరిగణిస్తారు. ఇది మన గుండె ఆరోగ్యం, జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా సార్లు ప్రజలు తమ ఆహారంలో ఫైబర్‌ను చేర్చుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల కారణంగా, ఫైబర్ తీసుకున్నప్పటికీ, శరీరానికి తగినంత ఫైబర్ అందదు. ఫైబర్ తీసుకునేటప్పుడు మీరు చేయకూడని కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుంటే.. ఫైబర్ తీసుకోవడం మన శరీరానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. దానిని చాలా త్వరగా తినడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం నుండి రాత్రిపూట అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది, దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి. మీ ఆహారంలో ఫైబర్‌ను నెమ్మదిగా పెంచండి.

తగినంత నీరు తాగకపోవడం – ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత మీరు తగినంత నీరు తాగకపోతే, అది మలం పొడిగా, గట్టిగా మారడానికి కారణమవుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. మీరు ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకున్నప్పుడు నీరు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

కూరగాయలపై మాత్రమే ఆధారపడటం- కూరగాయలు నిస్సందేహంగా ఫైబర్ యొక్క మంచి మూలం, కానీ వాటిపై మాత్రమే ఆధారపడటం పెద్ద తప్పు.  మీరు బీన్స్,  ఓట్స్, చియా సీడ్స్‌ వంటి ఫైబర్‌ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం మనకు చాలా మంచింది.

ఫైబర్ గురించిన అపోహలు- ఫైబర్ తినడం వల్ల మలబద్ధకం వస్తుందనే భావన తరచుగా ప్రజలకు ఉంటుంది. అయితే, ఇది నిజం కాదని నిపులు చెబుతున్నారు. ఫైబర్ రోగనిరోధక శక్తి, జీవక్రియ, మెదడు ఆరోగ్యం, మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.  మీ కడుపులోని సూక్ష్మజీవులు ఫైబర్‌ను శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలుగా మారుస్తాయి. అయితే ఎక్కడు ఫైబర్‌ తీసకున్నప్పుడు.. అందుగు తగినంత నీరు తాగకపోతే.. మలబద్దక సమస్య రావచ్చు. 

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, నిపుణులు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన వివారాల ద్వారా అందజేయడమైనది. కావున ఈ అంశాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్, లేదా ఇతర వైద్యులను సంప్రదించండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.