Salt in Tea: టీలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే.. ఎన్ని బెనిఫిట్సో..

|

Feb 26, 2024 | 1:27 PM

కూరలు రుచిగా ఉండాలంటే ఉప్పు ఉండాల్సిందే. కూరల్లో సరిపడినంత ఉప్పు లేకపోతే.. అస్సలు రుచే ఉండదు. ఉప్పును తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టీలో ఉప్పు కలుపుకుని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? అదేంటి? అని ఆశ్యర్య పోతున్నారా. ఈ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉదయం లేవగానే చాలా మందికి టీ..

Salt in Tea: టీలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే.. ఎన్ని బెనిఫిట్సో..
Salt in Tea
Follow us on

కూరలు రుచిగా ఉండాలంటే ఉప్పు ఉండాల్సిందే. కూరల్లో సరిపడినంత ఉప్పు లేకపోతే.. అస్సలు రుచే ఉండదు. ఉప్పును తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టీలో ఉప్పు కలుపుకుని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? అదేంటి? అని ఆశ్యర్య పోతున్నారా. ఈ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగడం అలవాటు. తలనొప్పిగా ఉన్నా.. అలసటగా ఉన్నా టీ పడాల్సిందే. మరి కొందరు ఆరోగ్యం కోసం గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి కూడా తాగుతారు. అదే ఈ సాల్ట్ టీ తాగినా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా తీసుకోవాలి. అప్పుడే ప్రయోజనాలు ఉంటాయి. అలాగే టీలో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఇంకా ఆరోగ్యం. అలాగే మీరు తాగే టీలోనే చిటికెడు ఉప్పు వేసుకుంటే ఇంకా బెటర్. ఈ సాల్ట్ టీని కాశ్మీర్, చైనాలో ఎక్కువగా తాగుతారు. మరీ ఎక్కువగా కాదు.. చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. మీరు ఎలా టీ చేసుకుంటారో అలాగే తయారు చేసుకుని.. చివర్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంతే.

సాల్ట్ టీ తాగడం వల్ల ప్రయోజనాలు:

1. ఈ సాల్ట్ టీ తాగితే.. శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ సంరక్షించ బడతాయి. ఎసిడిటీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

2. ఈ టీ తాగితే.. గొంతు సమస్యలు, నోటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో మెటబాలిజం సజావుగా సాగుతుంది.

3. మైగ్రేన్ సమస్యతో బాధ పడేవారు సాల్ట్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ముఖంపై వచ్చే మొటిమల సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

4. ఈ టీ తాగితే నరాల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.

5. సాల్ట్ కలిపిన టీ తాగితే.. శరీరంలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటుంది.

6. ఉప్పు కలిపిన టీ తాగడం వల్ల రక్త పోటు అనేది అదుపు అవుతుంది. అదే విధంగా గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. క్యాన్సర్ కణాలు కూడా ఏర్పడకుండా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు