
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అలా ఉల్లిలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ఉల్లిపాయతో చర్మ, జుట్టు, ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. నిత్యవసర వస్తువుల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఉల్లిపాయ ఉపయోగించకుండా ఏ రోజు కూడా పూర్తి కాదు. ఏదో ఒక రూపంలో ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఉల్లిపాయలను కట్ చేసిన తర్వాత ఉల్లి తొక్కలను, పొట్టును పడేస్తారు. కానీ ఈ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. వీటిల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ తొక్కలతో చర్మం, జుట్టు సమస్యలతో పాటు కంటి చూపును కూడా మెరుగు పరచుకోవచ్చు. మరి ఈ ఉల్లి తొక్కలతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ తొక్కల్లో విటమిన్లు ఇ, సి, ఎ, పొటాషియం, క్యాల్షియం, ఫ్లేవనాయిడ్లు, యంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.
ఉల్లిపాయ తొక్కల్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ తొక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి నీటిలో వేసి ఓ పది నిమిషాలు మరిగించండి. ఈ నీటిని చల్లారిన తర్వాత తాగండి. ఇందులో క్వెర్సెటివ్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఉల్లిపాయ తొక్కల్లో ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఉల్లి తొక్కలు మరిగించిన నీటిని తాగితే.. జీర్ణ క్రియ కూడా మెరుగ్గ పని చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఉల్లిపాయ తొక్కలు మరిగించిన నీటిని తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ నీటిని తాగితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు తాగితే ఆకలి తగ్గుతుంది.
ఉల్లిపాయలు తొక్కలు మరిగించిన నీటిని తాగినా లేక జుట్టుకు అప్లై చేసినా.. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. జుట్టు కూడా తెల్లబడకుండా నల్లగా మారుతుంది. నల్ల జుట్టు కావాలి అనుకునేవారు కూడా ఈ నీటిని తాగవచ్చు. చర్మం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..