AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Figs: రాత్రి గ్లాసుడు నీళ్లలో అంజీర్‌లను నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే..?

అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అందుకే అంజీర్‌లను ఏ విధంగానైనా తినవచ్చు. కానీ ఆయుర్వేదం ప్రకారం..

Soaked Figs: రాత్రి గ్లాసుడు నీళ్లలో అంజీర్‌లను నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే..?
Soaked Anjeers
Srilakshmi C
|

Updated on: Sep 02, 2025 | 8:44 PM

Share

బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో అంజీర్‌లను చేర్చడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అందుకే అంజీర్‌లను ఏ విధంగానైనా తినవచ్చు. కానీ ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల నిర్దిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. ఎండుద్రాక్షల మాదిరిగానే వీటిని కూడా నీళ్లలో నానబెట్టి తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లలో క్లోరోజెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అంతేకాకుండా నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని తగ్గించడంలో ప్రభావం

అంజీర్ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంజీర్ పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకంతో బాధపడుతున్న రోగులు నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుదల

ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరగడం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీంతో బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లడం నుంచి డైట్ పాటించడం వరకు వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. కానీ వీటికి బదులుగా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఈ సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది.

ఎముకలను బలం

అంజీర్ పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ అంజీర్ పండ్ల వినియోగం ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లు ఎముకలను బలోపేతం చేయడంలో పాలు మాదిరి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎముకలు బలపడతాయి.

రక్తపోటు నియంత్రణ

అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మరిన్నా ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..