AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బచ్చలికూర ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!

బచ్చలి కూరలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. ఈ కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూర తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

బచ్చలికూర ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!
Bachhali Kura
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2025 | 10:56 PM

Share

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ఈ బచ్చలి కూరలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. ఈ కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూర తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…

ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.. కొన్ని ఆకులు నూరి కణతకు పెడితే.. తలలోని వేడి కూడా తగ్గుతుంది.

బచ్చలి కూరలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బచ్చలి కూరలో విటమిన్ ఎ, లుటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బచ్చలి కూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ బచ్చలికూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి. పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు. దీంతో తరచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు తీరతాయి. కీళ్లనొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు, శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం. అదే విధంగా బచ్చలి ఆకులను రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.