AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి ఈ సమస్య వల్ల కూడా హార్ట్‌ఎటాక్‌ వస్తుందా.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మహమ్మారికి బలవుతున్నారు. గుండెపోటు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. కానీ నోటి బ్యాక్టీరియా కారణంగా కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని కొద్ద అధ్యయనాల చెబుతున్నాయి.

ఏంటి ఈ సమస్య వల్ల కూడా హార్ట్‌ఎటాక్‌ వస్తుందా.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు
Heart Health
Anand T
|

Updated on: Sep 23, 2025 | 10:47 PM

Share

గతంలో వృద్ధులకు మాత్రమే గుండెపోటు వచ్చేది, కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, సరైన ఆహారం లేకపోవడం, అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇవి మాత్రమే దీనికి కారణాలు కావు. ఇటీవలి పరిశోధనలో, శాస్త్రవేత్తలు గుండెపోటుకు మరో ఆశ్చర్యకరమైన కారణాన్ని వెల్లడించారు. ఫిన్లాండ్, UK పరిశోధకులు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నోటి బ్యాక్టీరియా, ముఖ్యంగా విరిడాన్స్ స్ట్రెప్టోకోకి ప్రాణాంతక గుండెపోటు రావడానికి కారణమవుతాయిని పేర్కొంది.

పరిశోధనలో ఏమి తేలింది?

అకస్మాత్తుగా మరణించిన 121 మంది గుండె ధమనులలో ఫలకం నిక్షేపాలను పరిశోధకులు పరిశీలించారు. శస్త్రచికిత్స చేయించుకున్న 96 మంది రోగుల నుండి ధమని నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈ నమూనాలలో దాదాపు సగం కేసులలో నోటి బ్యాక్టీరియా నుండి DNA ఉందని తేలింది. అత్యంత సాధారణ బ్యాక్టీరియా విరిడాన్స్ స్ట్రెప్టోకోకి, ఇది 42% గుండె ఫలకం, 43% శస్త్రచికిత్స నమూనాలలో కనుగొనబడింది.

బాక్టీరియా గుండెపోటుకు ఎలా కారణమవుతుంది ?

ధమనులలో ఏర్పడే కొవ్వు (ఫలకాలు) పొరలలో బాక్టీరియా పేరుకుపోతుంది, ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా క్రమంగా ఒక జిగట పొర (బయోఫిల్మ్) ను ఏర్పరుస్తుంది, ఇది మీ రోగనిరోధక వ్యవస్థను గుర్తించకుండా నిరోధిస్తుంది. ఈ ఫలకం చీలిపోయినప్పుడు, బాక్టీరియా, వాటి శకలాలు విడుదలవుతాయి. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తాయి. అంటే వాపుకు కారణమవుతుంది. ఈ వాపు ధమని గోడలను బలహీనపరుస్తుంది, దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెంచుతుంది.

నోటి పరిశుభ్రత ఎందుకు ముఖ్యం?

మీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మీ గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీ నోటిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రమాదకరమైన గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

నోటి ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ?

  • రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలు పళ్ళు తోముకోండి.
  • మీ నాలుకను, దంతాలను శుభ్రం చేసుకోండి
  • తీపి పదార్థాలు, పానీయాలను వీలైనంత తక్కువగా తీసుకోండి.
  • ప్రతి 3-4 నెలలకు మీ టూత్ బ్రష్‌ను మార్చండి.
  • సంవత్సరానికి ఒకసారి మీ దంతవైద్యుడిని సందర్శించండి.
  • పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నివారించండి.
  • మీ చిగుళ్ళలో రక్తస్రావం, నొప్పి లేదా వాపు ఎదురైతే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి.

Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.