Barley Water Benefits: బార్లీ వాటర్‌తో నిజంగానే అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బార్లీ గురించి చాలా మందికి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు వాతావరణం మారుతుంది. చలి వదిలి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ విపరీతంగా వస్తోంది. ఇలా వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, జలుబు, నీసరం, అలసటగా అనిపించడం, చెమట ఎక్కువగా పట్టడం వంటి సమస్యలు..

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో నిజంగానే అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
Barley Water

Updated on: Feb 09, 2024 | 2:57 PM

బార్లీ గురించి చాలా మందికి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు వాతావరణం మారుతుంది. చలి వదిలి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ విపరీతంగా వస్తోంది. ఇలా వాతావరణం మారుతున్నప్పుడు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, జలుబు, నీసరం, అలసటగా అనిపించడం, చెమట ఎక్కువగా పట్టడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వీటిన్నింటి నుంచి మంచి ఉపశమనం పొందాలంటే.. బార్లీ వాటర్ తాగాల్సిందే. బార్లీలో శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి.. బార్లీ నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డీహైడ్రేషన్‌ సమస్య తగ్గిస్తుంది:

నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చెమట కూడా ఎక్కువగా పట్టడం, ఎండలో ఉండటం వల్ల చాలా మంది డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బార్లీ నీళ్లు తీసుకుంటే.. శరీరం హైడ్రేట్ అవుతుంది. కిడ్నీ సమస్యలతో బాధ పడేవారు సైతం బార్లీ వాటర్ తీసుకుంటే చాలా మంచిది.

శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

శరీరంలో వేడిని తగ్గించడంలో బార్లీ వాటర్ బాగా సహాయ పడతాయి. బార్లీలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, క్యాల్షియం శరీరాన్ని చల్ల బరుస్తుంది. వేసవిలో బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా డీహైడ్రేషన్ నిరోధించడానికి హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్ అవుతారు:

బరువు తగ్గాలి అనుకునే వారు బార్లీ వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బార్లీ వాటర్ కొద్దిగా తాగినా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న పోషకాలు సరిపడా శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలి అనుకునే వారు బార్లీ వాటర్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

క్యాన్సర్ కణాలను నశింప చేస్తుంది:

బార్లీ వాటర్ తాగడం వల్ల భయంకరమైన క్యాన్సర్ కణాలను కూడా నశింపచేస్తుంది. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద ప్రేగులో క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని ఆపుతాయి. అంతే కాకుండా శరీరంలో హానికరమైన వ్యాధులను నియంత్రించడంలో కూడా సహాయ పడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా బార్లీ వాటర్ తాగడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.