Black-eyed peas: అలసందలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, చర్మ, జుట్టు వంటి సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల లైఫ్ వల్ల.. సమయానికి కూడా తినడం లేదు. దీంతో పౌష్టికాహార లోపం ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే.. రోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో అల సందలు కూడా ఒకటి. వీటినే బొబ్బర్లు అని..

Black-eyed peas: అలసందలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!
Black Eyed Peas

Updated on: Mar 27, 2024 | 3:10 PM

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, చర్మ, జుట్టు వంటి సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల లైఫ్ వల్ల.. సమయానికి కూడా తినడం లేదు. దీంతో పౌష్టికాహార లోపం ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే.. రోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో అల సందలు కూడా ఒకటి. వీటినే బొబ్బర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. అలసందలు విరివిగానే మార్కెట్లలో లభ్యమవుతాయి. వీటిల్లో మంచి పోషకాలు లభిస్తాయి. వీటిని ప్రతి రోజూ మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అలసందల్లో ప్రయోజనాలు:

విటమిన్లు ఎ, సి, కె, బి, ఫోలేట్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నిషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.

కంటి చూపు మెరుగ్గా ఉంటుంది:

బొబ్బర్లు తినడం వల్ల కంటి చూపు మెరుగ్గా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. వయసు పెరిగినా కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

అల సందలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి.. తక్కువగా తిన్నా కడుపు నిండుతుంది. దీంతో ఇతర ఆహారాలను తీసుకోలేరు. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి:

అల సందలు తినడం వల్ల కండరాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బొబ్బర్లలో ఉండే ప్రోటీన్.. కండరాలు బలంగా ఉండేందుకు సహాయ పడతాయి. కండరాలు పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ చాలా అవసరం.

గుండె హెల్దీగా ఉంటుంది:

బొబ్బర్లు తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అల సందల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీని వల్ల కణాలు డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. బొబ్బర్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రక్త పోటు పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..