
చలికాలం వచ్చిందంటే చాలు.. ఎండలో కూర్చుని పల్లీలు తినడం అందరికీ ఇష్టమే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పల్లీలను తిని, చాలామంది ఆ పొట్టును చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ ఆ పొట్టులో మీ పగిలిన మడమలను మెరిపించే అద్భుత శక్తి ఉందని మీకు తెలుసా? అవును వేరుశెనగ పొట్టుతో ఇంట్లోనే సులభంగా ఫుట్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.
పల్లీల పొట్టులో సహజ నూనెలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాదాల వద్ద దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలో, చర్మ కణాలను మృదువుగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పొడి సిద్ధం చేయండి: ముందుగా పల్లీల పొట్టును శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
మిశ్రమం: ఒక గిన్నెలో రెండు స్పూన్ల పొట్టు పొడిని తీసుకుని, దానికి తేనె, కొబ్బరి నూనె కలపాలి. చివరగా పచ్చి పాలు పోస్తూ చిక్కని పేస్ట్‌లా తయారు చేయాలి.
పాదాల శుభ్రత: ఈ మాస్క్ వేసుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటిలో 5-7 నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.
మసాజ్: సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను మడమలకు రాసి, చేతులతో మెల్లగా మసాజ్ చేయాలి. ఇది సహజ స్క్రబ్‌లా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది.
20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసి, మాయిశ్చరైజర్ లేదా వాసెలిన్ రాసి సాక్స్ ధరించాలి. ఇలా క్రమంగా చేస్తే పగిలిన మడమలు మృదువుగా మారుతాయి.
పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి వేడిని అందించి, చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి. ఇందులోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్-ఇ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, మెదడు చురుగ్గా పనిచేయడంలో వేరుశెనగ తోడ్పడుతుంది.
వేరుశెనగలు శరీరంలో వేడిని కలిగిస్తాయి కాబట్టి అతిగా తినడం వల్ల ఎసిడిటీ లేదా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. అందుకే పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..