AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overthinking: మీలో ఓవర్ థింకింగ్ లక్షణాలు ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!

ఆలోచించడం మనిషికి ఉన్న గొప్ప వరం. కానీ కొంతమందికి ఇదొక శాపం. ఎలాగంటే.. కొంతమంది సమస్య వచ్చినప్పుడు ఆలోచించి ఆలోచించి.. సొల్యూషన్ దొరికాక కూడా ఇంకా ఆలోచించి తిరిగితిరిగి మొదటికొస్తారు. ఇలాంటి వాళ్లకు ఆలోచనలే శాపం. ఎందుకంటే వీళ్లది మామూలు ధింకింగ్ కాదు. ఇది ఓవర్ థింకింగ్ అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచిస్తూ లేనిపోని సమస్యలు తెచ్చుకోవడాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. ఇదెలా ఉంటుందంటే..

Overthinking: మీలో ఓవర్ థింకింగ్ లక్షణాలు ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!
Overthinking
Nikhil
|

Updated on: Oct 22, 2025 | 5:44 PM

Share

ఆలోచించడం అనేది అంతులేని ప్రవాహం లాంటిది. అది ఎప్పటికీ అలా పోతునే ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే… ఉదాహరణకు ఏదైనా విషయం గురించి  డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వస్తారు. చివరి నిర్ణయం తీసుకున్నాక  అక్కడితో ఆ విషయం ముగించాలి.  కానీ ఓవర్ థింకింగ్ లో అలా కాదు.  డెసిషన్ తీసుకున్నాక మళ్లీ డెసిషన్ మీద ప్రశ్న వస్తుంది. లేనిపోని భయాలు మొదలవుతాయి. అయితే ఇలాంటి ఓవర్ థింకింగ్ తో చాలానే నష్టాలున్నాంటున్నారు డాక్టర్లు

నష్టాలివే..

ఓవర్ థింకింగ్ అనేది అంతపెద్ద మెంటల్ డిజార్డర్ కాకపోయినా ఒకరకమైన మానసిక సమస్యగానే చూడాలి. ఎందుకంటే… ఓవర్ థింకింగ్ మెదడుని పూర్తిగా పిండి చేస్తుంది.  సరైన లాజిక్ లేకుండా ఆలోచిస్తూ ఉండడం వల్ల మెదడు తన పనితనాన్ని పోగొట్టుకుంటుంది. దాంతో ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వస్తాయి. అతిగా ఆలోచించడం వ్యక్తిగత ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపుతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అవసరమైన, చేయాల్సిన పనులు పైన దృష్టి నిలపడం కష్టంగా మారుతుంది. ఓవర్ థింకింగ్ చేసేవారు ఈజీగా డిప్రెషన్‌కి లోనవుతారు. అలాంటి వాళ్లకు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా  తగ్గుతుంది.  అతిగా ఆలోచించడం వల్ల మెదుడులో  విశ్లేషణాత్మక శక్తి తగ్గిపోతుంది. బ్రెయిన్  చాలా సులభంగా అలసిపోతుంది. ఏదైనా పని చేయాలన్నా  మోటివేషన్ కూడా రాదు, ఊరికే చిరాకుగా అనిపిస్తుంది.

ఇలా తగ్గించొచ్చు

  • ఓవర్ థింకింగ్ ను గుర్తించినప్పుడు దానిపట్ల కాస్త అవేర్ గా ఉండాలి. ఒక ఆలోచన గురించి మెదడు మరీ ఎక్కువగా ఆలోచిస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే ఆలోచనను వేరే ఆలోచనతో రీప్లేస్ చేయాలి. ఇది మొదట్లో కష్టంగా ఉన్నా ప్రాక్టిస్ చేస్తే అలవాటవుతుంది.
  • ఆలోచనను మరో ఆలోచనతో రీప్లేస్ చేయడం ఓవర్ థింకింగ్ కు బెస్ట్ సొల్యూషన్. అలా అని రీప్లేస్ చేసిన ఆలోచనలో కూడా అలాగే మునిగి పోతే ఉపయోగం లేదు. వస్తున్న థాట్స్ పట్ల అవేర్ గా ఉంటూ వాటిని కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేయాలి.
  • సెల్ఫ్ టాకింగ్ తో కూడా ఓవర్ థింకింగ్ ను తగ్గించొచ్చు. రోజూ కొంత సేపు తమతో తాము అద్దంలో మాట్లాడుకోవడం వల్ల మెదడుకి ఆలోచనలను అర్థం చేసుకోవడం అలవాటవుతుంది. అవసరం లేని పిచ్చి ఆలోచనల కోసం టైం వేస్ట్ చేయడం తగ్గుతుంది.
  • కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా కూడా ఓవర్ థింకింగ్ ను అదుపు చేయొచ్చు. ఇష్టమైన మ్యూజిక్ వినడం, నచ్చినవి చూడడం, ఆశ్వాదిస్తూ తినడం, యోగా, మెడిటేషన్ వంటివి అలవాటుచేసుకోవడం వల్ల మెదడు ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా ఉండగలుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..