AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: సంతోషంగా ఉండాలా.? అయితే కాసేపు ఎండలో ఉండండి..

మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు సక్రమంగా పనిచేయడానికి పలు రకాల న్యూరోస్టిరాయిడ్లను వాడకుంటుంది. వీటిలో విటమిన్‌ డీ కూడా ఒకటి. వెన్నుద్రవంలో, మెదడు అంతటా ఇది ఉంటున్నట్టు ఇటీవల పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు పేర్కొన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని...

Lifestyle: సంతోషంగా ఉండాలా.? అయితే కాసేపు ఎండలో ఉండండి..
Lifestyle
Narender Vaitla
|

Updated on: Aug 16, 2024 | 10:33 PM

Share

మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో విటమిన్‌ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా విటమిన్‌ డి అనగానే మనం ఎముకల ఆరోగ్యం గురించే ఆలోచిస్తాం. సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే. ఎముకలు గుల్లబారకుండా ఉంటాయని, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసిందే. అయితే విటమిన్‌ డీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్ఆనరు. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినే కాకుండా.. విటమిన్‌ డి కుంగుబాటును కూడా నివారిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు సక్రమంగా పనిచేయడానికి పలు రకాల న్యూరోస్టిరాయిడ్లను వాడకుంటుంది. వీటిలో విటమిన్‌ డీ కూడా ఒకటి. వెన్నుద్రవంలో, మెదడు అంతటా ఇది ఉంటున్నట్టు ఇటీవల పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు పేర్కొన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో డాపమైన్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే.

అయితే డోపమైన్‌ ఉత్పత్తయ్యే సబ్‌స్టాన్షియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విటమిన్‌ డి గ్రాహకాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. మానసిక సమస్యలను దూరం చేయడంలో విటమిన్‌ డీ కి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని అనడానికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చర్మానికి ఎండ తగిలిన సమయంలో 7-డీహైడ్రోకొలెస్ట్రాల్‌ పుట్టుకొచ్చి, విటమిన్‌ డి3గా మారుతుంది. ఇది కాలేయం నుంచి కిడ్నీలకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 1.25 డైహైడ్రాక్సీ విటమిన్‌ డిగా రూపాంతరం చెందుతుంది. మన శరీరం వాడుకునే విటమిన్‌ డీ ఇదే.

అందుకే కచ్చితంగా ఉదయం కాసేపు ఎండలో ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఎండలో ఉంటే మానసికస్థితిని ప్రభావితం చేసే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ కూడా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుంగుబాటు వంటి లక్షణాలు దూరమవుతాయి. కేవలం సూర్యరశ్మితో మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం ద్వారా కూడా శరీరానికి కావాల్సిన విటమిన్‌డిని అందిస్తుంది. ముఖ్యంగా పాలు, పుట్టగొడుగులు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us