Lifestyle: ఉపవాసం సమయంలో ఎలాంటి పండ్లు తీసుకోవాలో తెలుసా.?

మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం ఆచారంగా వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉపవాసం చేసే వారు మనలో చాలా మందే ఉంటారు. రోజతంగా ఉపవాసం ఉండి రాత్రి కేవలం పండ్లు తీసుకుంటారు. అయితే చాలాసేపు ఏం తినకుండా ఉండి రాత్రి కేవలం పండ్లను మాత్రమే తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడే...

Lifestyle: ఉపవాసం సమయంలో ఎలాంటి పండ్లు తీసుకోవాలో తెలుసా.?
Fasting

Updated on: Mar 07, 2024 | 9:01 PM

మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం ఆచారంగా వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉపవాసం చేసే వారు మనలో చాలా మందే ఉంటారు. రోజతంగా ఉపవాసం ఉండి రాత్రి కేవలం పండ్లు తీసుకుంటారు. అయితే చాలాసేపు ఏం తినకుండా ఉండి రాత్రి కేవలం పండ్లను మాత్రమే తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉపవాసం సమయంలో కొన్ని రకాల పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఉపవాసం చేసే సమయంలో ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉపవాసం సమయంలో తీసుకోవాల్సి పండ్లలో అరటి పండు ఒకటి. పోషకాహారం అధికంగా లభించే పండ్లలో అరటి ముఖ్యమైంది. ఇది తక్షణం శక్తిని అందిస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉపవాస సమయంలో అరటిని తీసుకుంటే పొట్ట చాలా సేపు నిండుగా ఉంటుంది.

* ఉపవాసం చేసే సమయంలో యాపిల్‌ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్‌లో ఫైబర్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. యాపిల్‌ తీసుకుంటే తక్షణమే శక్తి రావడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

* బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఉపవాస సమయంలో పోషకాహారం కూడా లభిస్తుంది.

* ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది, ఇది ఉపవాస సమయంలో తక్షణ శక్తిని అందిస్తుంది. ద్రాక్ష తీసుకోవడం వల్ల కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

* పియర్ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇది ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..