Stress: ఒత్తిడితో చిత్తవుతోన్న యువత.. అసలు కారణం ఏంటంటే, తాజా నివేదికలో..

ఒత్తిడి.. ఒకప్పుడు ఇలాంటి ఒక సమస్య ఉంటుందని కూడా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఒత్తిడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. శారీరక సమస్యలకు ఆసుపత్రులు ఉన్నట్లు. మానసిక సమస్యలకు కూడా చికిత్సలు అందించే రోజులు వచ్చేశాయ్‌. అయితే రోజురోజుకీ మానసిక ఒత్తిడి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది...

Stress: ఒత్తిడితో చిత్తవుతోన్న యువత.. అసలు కారణం ఏంటంటే, తాజా నివేదికలో..
Stress
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Narender Vaitla

Updated on: Jul 28, 2024 | 12:43 PM

ఒత్తిడి.. ఒకప్పుడు ఇలాంటి ఒక సమస్య ఉంటుందని కూడా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఒత్తిడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. శారీరక సమస్యలకు ఆసుపత్రులు ఉన్నట్లు. మానసిక సమస్యలకు కూడా చికిత్సలు అందించే రోజులు వచ్చేశాయ్‌. అయితే రోజురోజుకీ మానసిక ఒత్తిడి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఒత్తిడి బాధతో ఇబ్బందిపడుతున్నారు. ఇంతకీ యువతలో ఈ సమస్య పెరగడానికి అసలు కారణం ఏంటన్న దానిపై ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి..

సాధారణంగా వయసులో ఉన్నవాళ్లు కోట్ల గిత్తల పూట మీద ఉంటారని ఇప్పటిదాకా అందరి భావన. కానీ వయసు పైబడిన వారితో పోలిస్తే యువకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఓ నివేదికలో వెళ్లడైంది. భారతీయ వెల్నెస్ సంస్థ యువర్ దోస్త్ తాజా సర్వేలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్టు తేలింది. అదే సమయంలో 40 ఏళ్ల పైబడిన వాళ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నారని నివేదికలో తెలిపారు.

5000 మంది భారతీయ ఉద్యోగులపై జరిపిన సర్వే ఆధారంగా కొన్ని విషయాలను తేల్చారు. యువర్ దోస్త్ నివేదిక ప్రకారం వర్క్ ఫ్రం హోం, పని వేళలు, భవిష్యత్తుపై బెంగ కారణంగా 21 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. అదే సమయంలో 31 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు స్ట్రెస్ గానే ఉంటున్నారట… తలపై దాటిన వాళ్లు కాస్త రిలాక్స్గా ఉండటానికి కారణం ఆ వయసుకు జీవితం పై స్పష్టమైన అవగాహన రావడమే అంటున్నారు సర్వే చేసిన వారు. అధిక ఒత్తిడికి గురవుతున్న వారిలో పురుషులకన్నా స్త్రీలు ఎక్కువ శాతం ఉంటున్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది మహిళలు తాము మానసిక ఆందోళన చెందుతున్నమని పేర్కొన్నారు. పని, కుటుంబ జీవితం ఈ రెండిటి మధ్య సమతుల్యత కోల్పోవడం వల్లే ఈ తరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. వారి జీవితంలో సమస్యలను గుర్తించడంలోనూ విఫలమవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో లేని సమస్యను ఊహించుకొని తగిన పరిష్కారం కోసం వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని కోల్పోతున్నారని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..