మహిళలు గుండెజబ్బులు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:24 PM

గుండెజబ్బులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అయితే.. సమస్య వచ్చాక బాధపడేబదులు రాకముందే జాగ్రత్తపడడం చాలా అవసరం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మహిళలు కూడా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని న్యూ యూనివర్సిటీ మహిళల్లో వస్తున్న గుండెజబ్బులపై పలు సర్వేలు చేపట్టింది. దాదాపుగా అమెరికన్ మహిళల్లో 25శాతంకి పైగా మహిళలు పనిచేయకుండా ఇన్ ఆక్టివ్ గా ఉంటున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ఈ ప్రభావంతోనే దాదాపు 42శాతం మంది మహిళలు గుండెజబ్బుల బారిన పడుతున్నారని.. అంతే […]

మహిళలు గుండెజబ్బులు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుండెజబ్బులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అయితే.. సమస్య వచ్చాక బాధపడేబదులు రాకముందే జాగ్రత్తపడడం చాలా అవసరం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మహిళలు కూడా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని న్యూ యూనివర్సిటీ మహిళల్లో వస్తున్న గుండెజబ్బులపై పలు సర్వేలు చేపట్టింది. దాదాపుగా అమెరికన్ మహిళల్లో 25శాతంకి పైగా మహిళలు పనిచేయకుండా ఇన్ ఆక్టివ్ గా ఉంటున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ఈ ప్రభావంతోనే దాదాపు 42శాతం మంది మహిళలు గుండెజబ్బుల బారిన పడుతున్నారని.. అంతే కాకుండా హార్ట్ అటాక్ తో ప్రాణాలు కూడా కొల్పోతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మహిళలు ఈ గుండె జబ్బుల బారి నుంచి బయటపడేందుకు పలు చిట్కాలను తెలిపారు.

కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు చేపట్టిన సర్వేల్లో ప్రతి నలుగురి అమెరికన్ మహిళల్లో ఒకరు గుండెకు సంబంధించిన వ్యాధితో మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. అయితే వీరంతా కనీసం ఇంట్లో పనులు కానీ వ్యాయామం కానీ చేయకుండా ఉండేవారని గుర్తించారు. వీటివల్ల వీరంతా గుండెజబ్బులతో పాటుగా, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ రోగాల బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు పరిశోధనలు చేపట్టారు. సాధారణంగా మహిళలు గుండెజబ్బుల బారిన పడటం అనేది చాలా తక్కువ. అయితే ఏ మాత్రం పనిచేయకుండా పూర్తిగా ఇన్ ఆక్టివ్ గా ఉండే మహిళలే ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నారని.. వీరు కొంచెం జీవన శైలిని మార్చుకుంటే దీనిని అధిగమించవచ్చని యూనివర్సిటీ వైద్య బృందం తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

రోజులో సాధారణ వ్యాయామం కూడా అక్కర్లేకుండా మహిళలు గుండెజబ్బులు రాకుండా బయటపడొచ్చని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాన్ డియాగో పరిశోధక బృందం తెలిపింది. సుధీర్ఘంగా మూడున్నరేళ్లు దాదాపు 6వేల మంది మహిళలపై పరిశోధనలు చేపట్టారు. నిత్యం ఐదున్నర గంటల పాటు పనిచేస్తున్న వారు ఏలాంటి అనారోగ్యాలపాలు అవ్వడం లేదని గుర్తించారు. అలానే ఇంట్లో పనులు చేయకుండా ఉద్యోగం చేస్తూ.. జిమ్ కు వెళ్తున్న వారు కూడా గుండెజబ్బుల బారిన పడటం లేదని గుర్తించారు. అయితే జిమ్ వెళ్లడం కన్నా ఇంట్లో ఎక్కువ సమయం కూర్చోకుండా చిన్న చిన్న పనులు చేసినా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు సగటున ఐదున్నర గంటల పాటు ఇంట్లో పనిచేస్తే చాలని.. దీని ద్వారా గుండెజబ్బుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు మొత్తానికి ఐదున్నర గంటలపాటు శరీరంలో కదలికలు ఉంటే అదే చాలని.. ఇలా చేస్తే ఏలాంటి గుండెజబ్బులు దరిచేరవని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాన్ డియాగో వైద్య బృందం చెబుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu