AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ ఇంట్లో ఈ పండ్లు ఉంటే చాలు.. ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.. అవేంటో తెలుసా..?

ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మందులు వాడాల్సిన పనిలేదు.. మన ఇంట్లోని పండ్లతోనే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డీహైడ్రేషన్ నుంచి అధిక రక్తపోటు వరకు, అలసట నుంచి నిద్రలేమి వరకు.. ఏ సమస్యకు ఏ పండు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Health Tips: మీ ఇంట్లో ఈ పండ్లు ఉంటే చాలు.. ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.. అవేంటో తెలుసా..?
Fruits For Health
Krishna S
|

Updated on: Oct 08, 2025 | 11:01 PM

Share

పండ్లు కేవలం రుచికి మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, వ్యాధుల నుండి కాపాడతాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లు విటమిన్ సి అందిస్తే, అరటిపండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ప్రతి పండుకు దానిదైన ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం ఉంది. సాధారణంగా వచ్చే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఏ పండ్లు ఎంత బాగా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డీహైడ్రేషన్ – పుచ్చకాయ

వేసవిలో లేదా బయటకు వెళ్లినప్పుడు డీహైడ్రేషన్ సాధారణ సమస్య. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే నీటిని అందించి, డీహైడ్రేషన్ నుండి బయటపడేలా చేస్తుంది. ఎండలో నుంచి వచ్చినప్పుడు లేదా దాహం ఎక్కువగా ఉన్నప్పుడు తినడం మంచిది.

కండరాల తిమ్మిరి – అవకాడో

పరుగెత్తినప్పుడు పడుకున్న వెంటనే లేచినప్పుడు అకస్మాత్తుగా కండరాల తిమ్మిరి వస్తుంటుంది. అవకాడోలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరిని తగ్గించడంలో, కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అలసట – అరటిపండు

కొద్దిగా పని చేసినా లేదా నడిచినా వెంటనే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? అయితే మీ శరీరం శక్తి కోసం అడుగుతోందని అర్థం. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది మీ అలసటను తగ్గించి, ఉత్సాహంగా ఉంచుతుంది.

తలనొప్పి – బెర్రీలు

తరచుగా చిన్న చిన్న తలనొప్పులు వస్తుంటే, మందుల బదులు బెర్రీలను ప్రయత్నించండి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, మంటను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

కడుపు సంబంధిత సమస్యలు – బొప్పాయి

శరీరానికి అలవాటు లేని ఆహారం తీసుకోవడం వల్ల లేదా జీర్ణ సమస్యల వల్ల కడుపు ఇబ్బంది పడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు సమస్యలను సరిచేస్తుంది.

తక్కువ శక్తి – ఆపిల్

మీ శరీరంలో శక్తి లేదని, మందకొడిగా ఉందని అనిపిస్తే, ప్రతిరోజూ ఒక ఆపిల్ తినండి. ఆపిల్‌లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఉంటాయి. ఇది చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి, రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందుకే “రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు” అంటారు.

నిద్రలేమి – చెర్రీ

రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే, చెర్రీస్‌ను ఆహారంలో చేర్చుకోండి. చెర్రీస్‌లో మెలటోనిన్ అనే సహజ హార్మోన్ ఉంటుంది, ఇది నిద్ర-మేల్కొలుపు చక్రాలను నియంత్రిస్తుంది. ఇది నిద్రలేమిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

 అధిక రక్తపోటు – దానిమ్మ

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, దానిమ్మ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

ఈ పండ్లను తినడం ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. కానీ మీకు దీర్ఘకాలిక వ్యాధులు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం