AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప కళ్ళను తక్కువగా అంచనా వెయ్యొద్దు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు..!

చేపల కళ్ళలో ఉండే పోషకాలతో డయాబెటిస్ తగ్గుతుంది. విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల చేపల కళ్ళను తింటే శారీరక ఆరోగ్యం మెరుగుపడి ప్రశాంతమైన నిద్రను కలిగిస్తుంది. చేపల కళ్ళల్లో ఉండే పోషకాలతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. చేప కళ్ళలో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేప కళ్ళను తినడం వల్ల మనకు నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

చేప కళ్ళను తక్కువగా అంచనా వెయ్యొద్దు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు..!
Fish Eyes
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2025 | 10:19 PM

Share

చేపలు మంచి పౌష్టికాహారం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే చేపలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. చేపలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీర వాపును తగ్గిస్తాయి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే అద్భుతమైన ఆహారం..చేపలు కండరాల వృద్ధికి కీలకంగా పని చేస్తాయి. చేపలలో విటమిన్ D, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. చేపలు మాత్రమే కాదు చేప కళ్ళు కూడా అనేక పోషక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చేపల కళ్ళలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు, విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ ఈ, జింక్, ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే చేపకళ్ళ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరుకి మద్దతు లభిస్తుంది. చేపల కళ్ళు తింటే శరీర వాపులు, నొప్పులు తగ్గుతాయి. చేపల కళ్ళల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సమస్యలు దూరం చేస్తుంది. దృష్టి మెరుగవుతుంది. ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. చేప కళ్ళు రక్తపోటును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చేప కళ్ళలో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేప కళ్ళను తినడం వల్ల మనకు నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేప కళ్ళు మన రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. చేప కళ్ళను తినడం వల్ల చర్మ ఆరోగ్యం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. ఆటిజం వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి చేపల కళ్లు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చేపల కళ్ళలో ఉండే పోషకాలతో డయాబెటిస్ తగ్గుతుంది. విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల చేపల కళ్ళను తింటే శారీరక ఆరోగ్యం మెరుగుపడి ప్రశాంతమైన నిద్రను కలిగిస్తుంది. చేపల కళ్ళల్లో ఉండే పోషకాలతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..