సర్వరోగ నివారిణి ఈ ఆకు..! ఎన్ని రోగాలకి చెక్ పెట్టొచ్చో తెలుసా..?
వాము ఆకులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. వాము ఆకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ఆకు తింటే అధిక రక్తపోటు సైతం నియంత్రణలోకి వస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాము ఆకు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.
వాము ఆకులతో టీ కూడా తయారు కోసువచ్చు. ఇందుకోసం ముందుగా వాము ఆకులను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. వాము ఆకులను శుభ్రం చేసుకున్న తర్వాత నీటిని మరిగించుకొని అందులో వేయండి. వేసిన తర్వాత మూడు నిమిషాలు మరిగించి గాజు గ్లాసులో వడకట్టుకోండి. గాజు గ్లాస్‌లో వడకట్టుకున్న తర్వాత తగినంత తేనె వేసుకుని గాలి కడుపుతో తాగితే గ్యాస్టిక్ సమస్య సులభంగా మాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈ వాము ఆకును వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)








