AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Apple: ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని బెనిఫిట్స్ ఎగిరి గంతేస్తారు..!

ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అమృత ఫలం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ అరుదైన రోజ్‌ యాపిల్‌ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో గుండెకు కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Rose Apple: ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని బెనిఫిట్స్ ఎగిరి గంతేస్తారు..!
Rose Apple
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2025 | 9:45 PM

Share

రోజ్ యాపిల్..దీనినే వాటర్ యాపిల్‌ అని కూడా అంటారు. ఇది మన జామకాయల జాతికి చెందిన స్పెషల్ ఫ్రూట్‌. మంచి రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. రుచిలో కూడా అంతే మధురంగా ఉంటుంది. కేవలం రంగు, రుచి మాత్రమే కాదు.. రోజ్‌ యాపిల్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అమృత ఫలం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ అరుదైన రోజ్‌ యాపిల్‌ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో గుండెకు కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తరచూ రోజ్‌ యాపిల్‌ తీసుకోవటం వల్ల గుండెపోటు, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో విటమిన్ C రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్,బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నీటి శాతం అధికంగా ఉండటం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. తరచూ ఈ పండును మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోజ్‌ యాపిల్‌ జీర్ణ వ్యవస్థ మెరుగు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గించేస్తుంది. రోజ్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన చర్మం కాంతివంతంగా, యవ్వనంగా, మెరిసేలా ఉంచుతుంది.

రోజ్‌ యాపిల్‌ కెలొరీలు తక్కువగా, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. రోజ్‌ యాపిల్‌లోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది.  అంతేకాదు..రోజ్ యాపిల్‌లో జాంబోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు.. ఈ పండులోని గుణాలు గ్లూకోజ్ వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుందని చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి