AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నిలబడి నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీరు నిలబడి నీరు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.. జీర్ణక్రియ, కిడ్నీలు, కీళ్లపై మాత్రం పెద్ద ఎఫెక్ట్ పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.. నిలబడి తాగితే వచ్చే 5 పెద్ద నష్టాలు ఏంటో, అలాగే కూర్చుని నెమ్మదిగా నీరు ఎందుకు తాగాలనేది ఇక్కడ తెలుసుకోండి.

Health Tips: నిలబడి నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..
Stop Drinking Water While Standing
Krishna S
|

Updated on: Oct 12, 2025 | 10:18 PM

Share

మన శరీరానికి నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. నీళ్లు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా ఆవయవాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే నీరు తాగేటప్పుడు పాటించాల్సిన పద్ధతిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగకూడదు అనే నియమం గురించి తరచుగా వింటుంటాం. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని భావిస్తారు. దీని వెనుక ఉన్న నిజం ఏమిటో, నిలబడి నీరు తాగడం వల్ల నిజంగా ఏ నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మోకాళ్లపై ప్రభావం కేవలం అపోహేనా..?

ప్రముఖ డైటీషియన్ జుహి అరోరా తన సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లు దెబ్బతింటాయి లేదా ఇతర కీళ్లపై ప్రభావం చూపుతుందనే ఆలోచన ఒక అపోహ మాత్రమే. నిలబడి తాగేటప్పుడు నీరు అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వేగంగా వెళుతుంది. దీనికి మోకాళ్లపై ప్రత్యక్ష సంబంధం లేదు. కొంతమంది తొందరపడి నిలబడి నీరు త్రాగినప్పుడు అజీర్ణం లేదా అసౌకర్యానికి గురికావచ్చు.

నిలబడి నీరు త్రాగడం వల్ల కలిగే 5 ప్రధాన నష్టాలు

నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లకు నేరుగా హాని కలగకపోయినా.. ఇది జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు:

జీర్ణక్రియ దెబ్బతింటుంది: నిలబడి నీరు త్రాగితే, నీరు అన్నవాహిక ద్వారా వేగంగా కడుపులోకి వెళుతుంది. ఈ వేగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు రావొచ్చు.

కీళ్ల నొప్పులకు కారణం: నిలబడి తాగినప్పుడు అది సిరలపై ఒత్తిడి తెస్తుంది. కాలక్రమేణా కీళ్లలో ద్రవం పేరుకుపోవడం లేదా ద్రవ సమతుల్యత దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మూత్రపిండాలపై ప్రభావం: నిలబడి నీరు త్రాగితే అది ఫిల్టర్ కాకుండా వేగంగా కడుపులోకి వెళ్లిపోతుంది. దీనివల్ల నీటిలోని మలినాలు మూత్రాశయంలో పేరుకుపోతాయి. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

పోషకాల శోషణ లోపం: నిలబడి నీరు త్రాగినప్పుడు, అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించుకోవు.

నాడీ ఉద్రిక్తత: నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుందని, నరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుందని కూడా చెబుతారు.

ఆయుర్వేదం ప్రకారం.. నీటిని ఎల్లప్పుడూ కూర్చున్నప్పుడు, హాయిగా, చిన్న సిప్స్‌లో, నెమ్మదిగా త్రాగాలి. తొందరపడి నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నీరు త్రాగకూడదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..