Bad Eating Habits: ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడానికి ఈ 5 చెడు ఆహారపు అలవాట్లను మానివేయడం మంచిది.. అవేమింటంటే..?

|

Dec 05, 2022 | 6:28 PM

చెడు ఆహారపు అలవాట్లు మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాక బరువు పెరగడానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాలలో దీనికి మించిన సమస్యలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులు,

Bad Eating Habits: ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడానికి ఈ 5 చెడు ఆహారపు అలవాట్లను మానివేయడం మంచిది.. అవేమింటంటే..?
Bad Eating Habits
Follow us on

చెడు ఆహారపు అలవాట్లు మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాక బరువు పెరగడానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాలలో దీనికి మించిన సమస్యలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు దారితీస్తాయి. ఇంకా ఆహారపు అలవాట్లు మంచివా, చెడ్డవా అనేది మనం ఏమి తింటాము, ఎంతగా తింటాము అనే విషయాలపై అధారపడి ఉంటుంది. చిన్న చిన్న చెడ్డ అలవాట్లు పెద్దగా హాని కలిగించవని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే అది మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. మీకు అహారం తీసుకోవడంలో ఈ చెడు అలవాట్లు ఉంటే వెనువెంటనే వాటికి స్వస్తి పలకండి. తద్వారా ఆరోగ్య సమస్యలకు ఇప్పటినుంచే దూరంగా ఉండవచ్చు.

1. ఆకలితో అలమటించడం: బరువు తగ్గాలనుకున్నవారు తరచుగా చేసే తప్పులలో ఉపవాసం ఉండడం లేదా ఒక పూట భోజనం మానేయడం కూడా ఒకటి. ఆకలితో ఉండటం వల్ల మీరు వేగంగా బరువు తగ్గుతారని మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవానికి ఇది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. కాలక్రమేణా, ఇది మీ జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. తద్వారా మీరు సరిగ్గా పని చేయలేరు.

2. టిఫిన్ తినకుండా ఉండడం: ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. మీ శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం అనేది చాలా ముఖ్యం. తద్వారా మీకు రోజంతా శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. త్వరత్వరగా తినడం: మీరు మీ ఆహారాన్ని ఆస్వాదించకపోవడమే కాకుండా, మీ కడుపుతో సమకాలీకరించడానికి మీ మెదడుకు తగినంత సమయం ఇవ్వడం లేదు. చాలా త్వరగా తిన్నప్పుడు మీరు నిండుగా ఉన్నారని ప్రాసెస్ చేయడానికి మీ మెదడుకు తగినంత సమయం దొరకదు. ఫలితంగా చాలా త్వరగా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

4. రాత్రిపూట అతిగా తినడం: డెజర్ట్, శాండ్‌విచ్ లేదా ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవడానికి మనలో చాలా మంది రాత్రిపూట ఫ్రిజ్‌కి వెళ్లే సందర్భాలు ఉంటాయి. రాత్రిపూట లేదా నిద్రవేళకు ముందు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం బరువు పెరగడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా పరిమితికి మించిన భోజనం తినడం వల్ల రాత్రిపూట సరిగా నిద్రపోలేరు.

5. శరీరానికి అవసరమైనవాటిని వదిలేయడం: వైద్య కారణాలు ఉంటేనే తప్ప, పోషకాలను కలిగి ఉన్న అహారాన్ని భోజనం నుంచి తొలగించడం ఆరోగ్యకరమైన విషయం కాదు. ఆరోగ్య సమస్యల కారణంగా వేటినైనా తినడం మానేస్తే.. వాటికి బదులుగా వేరేవాటిని తినడం మంచిది. ఉదాహరణకు.. కొందరు బరువు తగ్గడానికి వారి ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించుకుంటారు. ఫలితంగా శరీరానికి కావలసిన పోషకాలు లభించవు. అందుకని వాటికి బదులుగా చిలగడదుంప, క్వినోవా, ఓట్స్, బెర్రీలు, అరటిపండ్లు వంటి ఆహారాలలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను మీ ఆహారంలో చేర్చండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..