ZyCoV-D Vaccine: దేశవ్యాప్తంగా పిల్లలకు అందుబాటులోకి రానున్న స్వదేశీ టీకా.. అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు!

గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

ZyCoV-D Vaccine: దేశవ్యాప్తంగా పిల్లలకు అందుబాటులోకి రానున్న స్వదేశీ టీకా.. అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు!
Zydus Cadila Zycov D Covid 19 Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2021 | 1:47 PM

ZyCoV-D Vaccine in India: కొవాగ్జిన్‌‌ తర్వాత మరో మేడ్‌‌ ఇన్‌‌ ఇండియా కరోనా టీకా అందుబాటులోకి రాబోతోంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్‌గానూ నిలువనుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్ వ్యాక్సిన్‌ 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా.. మరొకటి స్వదేశీ టీకా. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వీ టీకాలు రెండు డోసులు కాగా.. జైకోవ్‌ డీ వ్యాక్సిన్‌ మూడు డోసులు. కరోనాకు వ్యతిరేకంగా జైడస్‌ క్యాడిలా మరో స్వదేశీ టీకాపై పని చేస్తోంది. డీసీజీఐ అనుమతి ఇస్తే అందుబాటులోకి రానున్న నాలుగో టీకాగా నిలువనుంది.

మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో మోతాదు, మూడో మోతాదు 56 రోజుల తర్వాత వేయనున్నారు. జైకోవ్‌-డీ డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ వ్యాక్సిన్‌ కాగా.. 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చు. కంపెనీ 200 మిలియన్‌ మోతాదులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు భాగస్వాములతో కలిసి పని చేస్తున్నది. ఆగస్ట్ – డిసెంబర్‌ మధ్య 50 మిలియన్ల జైకోవ్‌-డీ టీకాల లభ్యత ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రాబోయే కొద్ది నెలల్లో ఈ టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయిదు లేదా ఆరు కొత్త కోవిడ్‌-​19 వ్యాక్సిన్లకు మద్దతు ఇవ్వాలన్న ప్రభుత్వ మిషన్‌లో భాగమని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. సెకండ్ వేవ్‌లో కరోనా విలయం, వ్యాక్సిన్ల కొరత, టీకా విధానంపై విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ మోతాదులను తయారు చేసి నిల్వ చేస్తామని వెల్లడించింది. కాగా, దేశంలో ఆగస్టునాటికి రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ , స్పుత్నిక్‌-వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే విదేశాల్లో డబ్ల్యుహెచ్‌వో ఆమోదం లభించిన ఫైజర్‌, మోడర్నాలాంటి ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా శరవేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తోంది.

Read Also…..  Betel Leaves Benfits : తమలపాకు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..! వివిధ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..