పాకిస్తాన్ లో హిందూ ఆలయం కూల్చివేత సబబే ! మత ప్రచారకుడు జకీర్ నాయక్, ఇది ఇస్లామిక్ దేశమని ప్రకటన

Umakanth Rao

Umakanth Rao | Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2021 | 11:34 AM

పాకిస్తాన్ లో హిందూ ఆలయం కూల్చివేతను తాను సమర్థిస్తున్నానని మత ప్రబోధకుడు జకీర్ నాయక్ అన్నారు. పాక్ ఖైబర్ పక్ టుంక్వా లోని..

పాకిస్తాన్ లో హిందూ ఆలయం కూల్చివేత సబబే ! మత ప్రచారకుడు జకీర్ నాయక్, ఇది ఇస్లామిక్ దేశమని ప్రకటన

Pakistan Hindu Temple  Demolition:పాకిస్తాన్ లో హిందూ ఆలయం కూల్చివేతను తాను సమర్థిస్తున్నానని మత ప్రబోధకుడు జకీర్ నాయక్ అన్నారు. పాక్ ఖైబర్ పక్ టుంక్వా లోని కరక్ టౌన్లో గత డిసెంబరు 30 న పురాతన హిందూ దేవాలయాన్ని రాడికల్ ఇస్లామిక్ పార్టీ కార్యకర్తలు కూల్చివేసి దగ్ధం చేశారు. నిజానికి ఓ ఇస్లామిక్ దేశంలో ఆలయాలను అనుమతించరాదని జకీర్ నాయక్ అన్నాడు. కాబాకు మహమ్మద్ తిరిగివచ్చినప్పుడు అక్కడి 360 విగ్రహాలను విరగగొట్టాడని, ఇస్లామిక్ దేశంలో శిలా విగ్రహాలు గానీ దేవతా విగ్రహాలు గానీ ఉండరాదని పేర్కొన్నాడు. ఏ ఇస్లామిక్ దేశంలో ఇవి ఉన్నా పగులగొట్టాల్సిందే అని జకీర్ నాయక్ వ్యాఖ్యానించాడు. కాగా కరక్ టౌన్ లో జరిగిన దుశ్చర్యను మానవతావాదులతో బాటు పాక్ లోని మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఖండించారు. ఆలయం కూల్చివేత, దహనాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ఇందుకు బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేయాలి అని ఆయన తన ట్విట్టర్లో కోరారు. మన ప్రజలు, వారి పవిత్ర స్థలాలకు భద్రత, రక్షణ ఉండాలని అన్నారు. ఈ ఆలయం మరమ్మతులకు స్థానిక హిందూ ప్రజలు అధికారుల నుంచి అనుమతి కోరినప్పటికీ రాడికల్ జమాయిత్ ఉలేమా ఇస్లాం పార్టీ సభ్యులు, కార్యకర్తలు దీన్ని కూల్చివేశారు.

Read More:

ఆలయాలపై వరుస ఘటనలతో ఏపీ పోలీస్‌ అప్రమత్తం.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘాః డీజీపీ

మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు ? ఔరంగాబాద్ పేరు మార్పుపై తంటా, సేన ప్రతిపాదన, వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.

Comedian Munawar Arrest: హిందూ దేవుళ్లు, అమిత్‌ షాపై కామెంట్ చేసిన ప్రముఖ కమెడియన్ అరెస్ట్.. పలు కేసులు నమోదు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu