అమిత్‌షాతో వైవీ సుబ్బారెడ్డి భేటీ!
ఏపీకి అండగా ఉండాలంటూ కేంద్ర మంత్రులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. టీటీడీ చైర్మన్ హోదాలో తొలిసారి ఢిల్లీకి వచ్చిన సుబ్బారెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లను కలిశారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.