YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!
కృష్ణా, గుంటూరు జిల్లాలోని అర్హులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది...
YS Jagan Sarkar: కృష్ణా, గుంటూరు జిల్లాలోని అర్హులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీని నిమిత్తం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అర్హులకు భూములను కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 54,307 మంది లబ్దిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది. కాగా, నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు.
Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?
Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!