AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!

సాధారణంగా మద్యం సేవించే వారిలో మధ్య వయస్కులు, యువతే ఎక్కువగా కనిపిస్తుంటారు. పార్టీలు, వేడుకలు అంటే మందు ఉండాల్సిందే అనే రోజులివి. కానీ మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలోని యువత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ గ్రామంలో మద్యానికి తావులేదని, బెల్ట్ షాపులు అసలే వద్దంటూ ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కి నిరసన గళం విప్పారు.

Telangana: మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
Mancherial Village Liquor Protest
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 1:57 PM

Share

తమ గ్రామానికి బెల్ట్‌ షాపులు తీసుకురావద్దని.. యువత రోడ్డెక్కి ధర్నాకి దిగిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా స్థానిక యువత తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. గ్రామస్తులందరినీ ఏకం చేసి ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.

మామూళ్ల మత్తులో అధికారులు

గ్రామంలో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామస్తులు మద్యానికి బానిసలవుతున్నారని యువత ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారి ఇళ్లు, ఒళ్లు గుళ్లవుతున్నాయని వాపోయారు. అంతేకాకుండా మద్యం మహమ్మారి కారణంగా తమ తోటి యువత భవిష్యత్తు కూడా నాశనమవుతోందని ఆందోళన చెందారు. బెల్ట్ షాపులను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులే మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపిస్తూ ఎక్సైజ్ సీఐ తీరుపై ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

తీర్మానం చేసినా పట్టించుకోని అధికారులు

ఇది ఇప్పటి సమస్య కాదని, గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా గతంలోనే గ్రామపంచాయతీలో తీర్మానం కూడా ఆమోదించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలోని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని, మద్యపానాన్ని నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామ యువత హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
2027 వన్డే కప్పు కొట్టేది మనోళ్లే
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై