AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది.. ఈ మార్పులతో ఆన్‌లైన్ సేవలు ఈజీ.. కొత్త ఫీచర్లు ఇవే..

ఆధార్ కార్డు సేవలను మరింత మెరుగుపర్చేందుకు యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆన్‌లైన్ సేవలు అందించే యూఐడీఏఐ వెబ్ సైట్లో మార్పులు చేసింది. వెబ్‌సైట్‌ను పూర్తిగా పునరుద్దరించింది. కొత్త వెబ్ సైట్‌ను కొద్ది రోజుల క్రితం లాంచ్ చేయగా.. ఇందులో కొత్త ఫీచర్లు చూద్దాం.

Aadhaar Card: ఆధార్ కార్డు కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది.. ఈ మార్పులతో ఆన్‌లైన్ సేవలు ఈజీ.. కొత్త ఫీచర్లు ఇవే..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Oct 05, 2026 | 1:26 PM

Share

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ వెబ్ సైట్‌ను పూర్తిగా పునరుద్దరించింది. ఈ మేరకు వెబ్ సైట్‌లో భారీ మార్పులు చేసింది. ఆధార్ సమాచారం, సేవలు వినియోగదారులు మరింత సులభతరంగా పొందేలా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను పూర్తిగా పున:రూపకల్పన చేసింది. స్క్రీన్ రీడర్ యూజర్‌ ఫ్ర్లెండీగా ఉండటం, ఫాంట్ సైజులు సర్దుబాటు చేసుకోవడం, రంగుల మధ్య వ్యత్యాసం, కీబోర్డ్ నావిగేషన్ సులువుగా ఉంచడం లాంటి మార్పులు చేసింది. దీని వల్ల వినియోగదారులు సులవుగా ఆప్షన్లను గుర్తించవచ్చు. సామాన్య జనం కూడా ఈజీగా అర్థం చేసుకుని ఆన్ లైన్ ద్వారా ఆధార్ సేవలు పొందేలా వెబ్‌సైట్‌లో ఆప్షన్లను తీసుకొచ్చారు.

కొత్త వెబ్‌సైట్లో మార్పులివే..

ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ 13 భాషల్లో అందుబాటులో ఉంది. అయితే 23 భాషలకు దీనిని భవిష్యత్తులో విస్తరించాలని యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త పోర్టల్‌లో కెరీర్ పోర్టల్ కూడా ఉంది. దీంతో ఉద్యోగాల కోసం అభ్యర్థులు సులువుగా సెర్చ్ చేయవచ్చు. ఇక దరఖాస్తు ప్రక్రియను మరింత వేగంగా ప్రాసెస్ చేయడం, పారదర్శకతకు పెద్ద పీట వేసేలా వెబ్‌సైట్‌ను రూపుదిద్దారు. పోర్టల్‌లో ఈ కొత్త అప్డేట్స్‌కు సంబంధించిన వివరాలను యూఐడీఏఐ తన ఎక్స్ ఖాతాలో వివరించింది. అద్భుతమైన అనుభవం, సమాచారం, సేవలు పొందేందుకు సరికొత్త UIDAI వెబ్‌సైట్‌ను చూడండి అంటూ పేర్కొంది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పోర్టల్‌లో చేసిన మార్పుల గురించి స్పష్టంగా వివరించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రతీఒక్కరూ ఆన్ లైన్ సేవలు పొందాలని సూచించింది. ఆధార్ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే మొబైల్ నెంబర్, అడ్రస్, పేరు వంటి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త వెబ్ సైట్‌లో సపోర్ట్ సేవలను కూడా చేర్చింది. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవచ్చు.

రేషన్ తీసుకోవాలంటే ఫేస్ చూపిస్తే చాలు..

ఇక సులువుగా రేషన్ షాపుల్లో లబ్దిదారులు రేషన్ పొందేలా ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థను యూఐడీఏఐ అప్డేట్ చేసింది. ఇప్పటివరకు రేషన్ తీసుకోవాలంటే ఆధార్ ఫింగర్ ప్రింట్ నిర్ధారణ చేసేవారు. కానీ కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వ్యవస్థ పని చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని నివారించేందుకు ఫేస్ రికగ్నేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో ముఖం స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తవుతుంది. దీని వల్ల రేషన్ పొందటంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయని చెప్పవచ్చు.  రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను రేషన్ షాపుల్లో ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఆధార్ ప్రాంతీయ కార్యాలయాల్లో టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా తమ వంతు వచ్చినప్పుడు వెళ్లి వినియోగదారులు సేవలు పొందవచ్చు.

Follow Us
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై
ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై
బజ్జి మిర్చితో ఇలా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా? అదిరిపోద్ది
బజ్జి మిర్చితో ఇలా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా? అదిరిపోద్ది
వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?
వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?
UPSC ఇంటర్వ్యూలో బిర్యానీపై ప్రశ్న.. IAS అఖిల్ బుద్ధి సమాధానం ఇదే
UPSC ఇంటర్వ్యూలో బిర్యానీపై ప్రశ్న.. IAS అఖిల్ బుద్ధి సమాధానం ఇదే
బంగారం, వెండి ఎందుకు కొనాలి..? ఈ లెక్కలు చూస్తే..
బంగారం, వెండి ఎందుకు కొనాలి..? ఈ లెక్కలు చూస్తే..
కాకి శ్రాద్ధ ప్రసాదం తినలేదా? పితృ పక్షంలో ఇలా చేస్తే సరిపోతుందట
కాకి శ్రాద్ధ ప్రసాదం తినలేదా? పితృ పక్షంలో ఇలా చేస్తే సరిపోతుందట
మామిడి తోటలో అలికిడి వినిపించి ఏంటా అని చూడగా..
మామిడి తోటలో అలికిడి వినిపించి ఏంటా అని చూడగా..