పబ్జీ గేమ్‌తో వల.. బాలికకేమైందంటే?

పబ్జీ గేమ్‌తో మైనర్ బాలికకు వల వేసిన ఓ యువకుడి ఉదంతం హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. గేమ్ పేరిట బాలికతో చాటింగ్ చేసిన యువకుడు ఆమె వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ చేసిన ఉదంతం ఇది. నాంపల్లి ఏరియాకు చెందిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఓ మైనర్ బాలికకు పబ్జీ గేమ్ నేర్పిస్తానంటూ దగ్గరయ్యాడు. మైనర్ బాలికతో చాటింగ్ చేసి వ్యక్తిగత సమాచారం తెలుసుకున్నాడు. బాలిక ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోలతోపాటు […]

పబ్జీ గేమ్‌తో వల.. బాలికకేమైందంటే?
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 28, 2019 | 5:51 PM

పబ్జీ గేమ్‌తో మైనర్ బాలికకు వల వేసిన ఓ యువకుడి ఉదంతం హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. గేమ్ పేరిట బాలికతో చాటింగ్ చేసిన యువకుడు ఆమె వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ చేసిన ఉదంతం ఇది.

నాంపల్లి ఏరియాకు చెందిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఓ మైనర్ బాలికకు పబ్జీ గేమ్ నేర్పిస్తానంటూ దగ్గరయ్యాడు. మైనర్ బాలికతో చాటింగ్ చేసి వ్యక్తిగత సమాచారం తెలుసుకున్నాడు. బాలిక ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనతో గడపక పోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

వాట్సప్ నంబర్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత ప్రేమ పేరుతో బాలిక పర్సనల్ ఫోటోలు సేకరించాడు. తనతో గడపాలని బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డ సల్మాన్ ఖాన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు పోలీసులు. సల్మాన్ ఖాన్ మొబైల్ డేటా ఆధారంగా ఎంత మంది అమ్మాయిలను మోసం చేశాడన్న అంశాన్ని కూపీ లాగుతున్నారు హైదరాబాద్ పోలీసులు.