నన్ను బెదిరిస్తున్నారు- విజయసాయి

వైసీపీపై టీడీపీ సహా ఏ పార్టీ, ఎటువంటి ఆరోపణలు చేసినా… వాటిని గట్టిగా తిప్పికొట్టేవారిలో ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముందుంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత  సాయిరెడ్డి మరింత దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ రావడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ […]

నన్ను బెదిరిస్తున్నారు- విజయసాయి

వైసీపీపై టీడీపీ సహా ఏ పార్టీ, ఎటువంటి ఆరోపణలు చేసినా… వాటిని గట్టిగా తిప్పికొట్టేవారిలో ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముందుంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత  సాయిరెడ్డి మరింత దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ రావడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారని అన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు తనను చంపుతామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. తనకు తరచుగా 9618729089, 9538362525, 8247662578, 8886059309 బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని వీటిపై దర్యాప్తు జరపాలని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu