నింగినంటుతోన్న కైలాసనాథుడు

గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచాన్ని అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విగ్రహం కూడా ఔరా అనిపించేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్‌ రాష్ట్రం నద్వారాలోని గణేష్ టెక్రీలో నిర్మిస్తున్న శివుడి విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాల్లో 4వ స్థానంలో నిలవనుంది. Uniting the spiritual soul of Nathdwara with top rated fun and entertainment sections, this blissful embodiment is on its way.#mirajgroup #statueofbelief […]

నింగినంటుతోన్న కైలాసనాథుడు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 02, 2019 | 4:19 PM

గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచాన్ని అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విగ్రహం కూడా ఔరా అనిపించేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్‌ రాష్ట్రం నద్వారాలోని గణేష్ టెక్రీలో నిర్మిస్తున్న శివుడి విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాల్లో 4వ స్థానంలో నిలవనుంది.

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఐక్యతా విగ్రహం మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దాని తర్వాత చైనాలోని స్ప్రింగ్ టెంపుల్, మయన్మార్‌లోని లేక్యున్ సేక్కియా విగ్రహాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. శివుడి విగ్రహం పూర్తయినట్లయితే ప్రపంచంలోని మొదటి ఐదు ఎత్తైన విగ్రహాల్లో భారతీయ విగ్రహాలే నిలుస్తాయి.

‘మిరేజ్ గ్రూప్’ సంస్థ తమ టౌన్ షిప్ నిర్మాణంలో భాగంగా 2013, ఏప్రిల్ 17న శివుడి విగ్రహం నిర్మాణాన్ని ప్రారంభించింది. శివుడు రాయిపై కుర్చొని ఆకాశం వైపు చూస్తున్నట్లుగా 351 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు 2,500 టన్నుల ఉక్కును వినియోగిస్తున్నారు. విగ్రహంలోని 20 అడుగులు, 110 అడుగులు, 270 అడుగుల వద్ద సందర్శకుల కోసం గ్యాలరీలు కూడా నిర్మిస్తున్నారు. పైకి చేరేందుకు ప్రత్యేకంగా ఎలివేటర్(లిఫ్ట్)లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ బిలీఫ్’ అని పేరు పెట్టారు.