AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క క్లిక్‌తో చెరగని”ముద్ర’.. స్మైల్‌ ప్లీజ్‌ !

ఒక మాట కొన్నాళ్లకు మర్చిపోతాం..ఓ పదం కొంతకాలానికి మరుగున పడుతుంది.  కానీ ఎన్నో భావాలను ఒక్క క్లిక్‌తో బంధించే ఓ ఫోటో చూస్తే.. ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. అలాగే ఫోటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. రెండు గ్రీకు పదాల కలయిక ఫోటోగ్రఫీ. 18వ శతాబ్ధంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌తో ప్రారంభమైన […]

ఒక్క క్లిక్‌తో చెరగనిముద్ర'.. స్మైల్‌ ప్లీజ్‌ !
Anil kumar poka
|

Updated on: Aug 19, 2019 | 6:15 PM

Share

ఒక మాట కొన్నాళ్లకు మర్చిపోతాం..ఓ పదం కొంతకాలానికి మరుగున పడుతుంది.  కానీ ఎన్నో భావాలను ఒక్క క్లిక్‌తో బంధించే ఓ ఫోటో చూస్తే.. ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. అలాగే ఫోటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. రెండు గ్రీకు పదాల కలయిక ఫోటోగ్రఫీ. 18వ శతాబ్ధంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌తో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కుతోంది.

1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్‌ హక్కులు కొనుగోలు చేసి..దానిని ప్రపంచానికి ఉచితంగా అందించింది. అందుకే ప్రతీయేటా ఆగస్టు 19ని అంతర్జాతీయ ఫోటోగ్రఫీడే జరుపుకుంటున్నారు. అలా అంచెలంచలుగా అనేక పరిణామాలు జరుపుకుంటూ..ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనలు, నిరంతర కృషి దాగువుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్య ఉద్దేశంమనిషి జీవన ప్రస్థానంలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మర్చిపోయేవైతే..మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి.  మరి కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. అలనాటి జ్ఞాపకాలను తిరిగి మరలా తనివితారా చూసుకోగలిగే అవకాశాన్ని అందించిన తీపి గుర్తులు ఫోటోలు.