International 2020 Round up: వరల్డ్ ఈవెంట్స్-2020, కరోనా వైరస్ ఇయర్, అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం కూడా ! వ్యాక్సిన్ల వెల్లువలో గడచిన ఏడాది

తమ దేశ విధానాలకు, ఈయూ నిబంధనలకు పొంతన లేదని భావించిన బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 2019 జులై 21 న ప్రధానిగా బోరిస్ జాన్సన్ పదవి చేబట్టినప్పటి నుంచే..

International  2020 Round up: వరల్డ్ ఈవెంట్స్-2020, కరోనా వైరస్ ఇయర్, అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం కూడా ! వ్యాక్సిన్ల వెల్లువలో గడచిన  ఏడాది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 12:03 PM

గడచిన సంవత్సరమంతా కరోనా వైరస్ ఇయర్ గా గడిచిపోయింది. చైనా న నుంచి పుట్టిందని చెబుతున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబలమైంది. జనవరి మొదటి వారం నుంచే చైనాలోని వూహాన్ ల్యాబ్ లో పుట్టుకకు దీని జీవం పడిందని యూఎస్ సహా ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నా చైనామాత్రం ఇప్పటికీ దీన్ని ఖండిస్తుండడం విశేషం. ఇక ఈ ఏడాదిలో ప్రధానమైనది అమెరికా అధ్యక్ష ఎన్నికలు. నవంబరులో ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ ఇప్పటికీ ఈ ఎన్నికల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఎలెక్టోరల్ =కాలేజీ ప్రకటించినా ట్రంప్ మాత్రం తన ఓటమిని జీర్ణించుకోలేక కోర్టుల్లో దావాలు వేయడం ఈ సంవత్సరపు ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.ఇక ఒకసారి ఈ సంవత్సరపు ‘రివైండ్’ లోకి ఒక్కసారి వెళదాం..

జనవరి 11 : చైనా నుంచి కరోనావైరస్ పుట్టిందా ?

చైనాలోని వూహాన్ సిటీ నుంచి కరోనా వైరస్ పుట్టిందని ప్రపంచదేశాలు అంటున్నాయి. ఈ సిటీలోని రేవు వద్ద జంతువుల అవశేషాల నుంచి ఇది జనించిందని, కాదు..కాదు..గబ్బిలాల నుంచి అని..ఇలా అనేక రకాల వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో దీన్ని పట్టించుకోకపోయినా  తరువాత పరోక్షంగా అంగీకరించక తప్పలేదు. జస్ట్ ఒక ల్యాబ్ లో జరిగిన పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తడమే విశేషం.

జనవరి 23 : యూరపియన్ యూనియన్ నుంచి యూకే నిష్క్రమణ

తమ దేశ విధానాలకు, ఈయూ నిబంధనలకు పొంతన లేదని భావించిన బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 2019 జులై 21 న ప్రధానిగా బోరిస్ జాన్సన్ పదవి చేబట్టినప్పటి నుంచే బ్రెక్జిట్ పేరిట దేశంలో రెఫరెండం వంటివి నిర్వహిస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున పార్లమెంటులో చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఓటింగ్ లో బ్రెగ్జిట్ కి అనుకూలంగా ఓట్లు పడడంతో 31 న పార్లమెంటు ఇందుకు అనుమతించింది. 27 దేశాల కూటమి గల ఈయూ నుంచి యూకే వైదొలగడం చెప్పుకోదగిన పరిణామం.

జనవరి 16 : డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సెనేట్ లో డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారన్న అభియోగం మోపారు. స్పీకర్ నాన్సీ పెలోసీ ఆధ్వర్యాన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఇందుకు ఆధారాలను చూపాలన్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరకు ఫిబ్రవరి మొదటివారంలో తిరిగి సభ సమావేశమై దీనిపై ఓటింగ్ చేపట్టాలని తీర్మానించింది.

జనవరి 26 : హెలికాఫ్టర్ ప్రమాదంలో బ్రియాంట్ మృతి

యూఎస్ లో పాపులర్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు నోబ్ బ్రియాంట్ తన 13 ఏళ్ళ కుమార్తె, మరో ఏడుగురితో సహా కాలిఫోర్నియాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాడు. కూతురు గీగీ తో బాటు ప్రయాణిస్తున్న 41 ఏళ్ళ ఈ ప్లేయర్ ఘోర దుర్ఘటనలో మృతి చెందడం ప్రపంచ క్రీడాకారులను విషాదంలో ముంచివేసింది. 2008, 2012 లో తమ దేశానికి బ్రియాంట్ ఒలంపిక్ స్వర్ణ పతకాలను తెచ్చి పెట్టాడు. అమెరికా అధ్యక్షునితో సహా పలువురు  దేశాధినేతలు కూడా తమ తీవ్ర సంతాపం తెలిపారు.

ఫిబ్రవరి 5 : అభిశంసన తీర్మానం నుంచి ట్రంప్ కి విముక్తి

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అభిశంసన తీర్మాన గండం నుంచి గట్టెక్కారు. ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి ఆధారాలు లేవని సెనేట్ తీర్మానించింది. ట్రంప్ కు అనుకూలంగా 230 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఈయన నిర్దోషిగా బయటపడ్డాడు. నేను చెప్పిందే నిజమైందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే డెమొక్రాట్లు మాత్రం ఈ తీర్మానం ఆయనకు అనుకూలంగా నెగ్గడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 24 : దోషిగా ఫిల్మ్ మేకర్ హార్వే వీన్ స్టీన్

పలు లైంగిక నేరాలకు, అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఫిల్మ్ మేకర్ హార్వే వీన్ స్టీన్ ని కోర్టు దోషిగా ప్రకటించింది. ది బర్నింగ్, ది సీక్రెట్ పోలీస్ మన్, డీప్ ఎండ్, షేక్స్ పియర్స్ ఇన్ లవ్ వంటి పలు మూవీలు తీసిన హార్వే ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. తమ పట్ల ఇతడు తీవ్ర హింసకు, రేప్ లకు పాల్పడ్డాడని, చిత్రాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ లైంగికంగా వేధించాడని, పలువురు మోడళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు కోర్టులో వాంగ్మూలమిచ్చారు. మార్చి 11 న హార్వే వీన్ స్టీన్ ని న్యూయార్క్ లోని జైలుకు తరలించారు. నిజానికి ఇతనికి మరణ శిక్ష విధించాల్సి ఉందని, కానీ ఇతని వయస్సు దృష్ట్యా జీవిత ఖైదు విధిస్తున్నామని జడ్జి ప్రకటించారు. హార్వే తీసిన సినిమాల్లో షేక్స్ పియర్ ఇన్ లవ్ పలు అవార్డులు దక్కించుకోవడం విశేషం.

మార్చి 11 : కోవిడ్ 19 పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. 114 దేశాల్లో 118,000 కేసులు అప్పుడే బయటపడ్డాయని, 4,291 మంది కరోనా రోగులు మృతి చెందారని ఈ సంస్థ హెడ్ టెడ్రోస్ ప్రకటించారు. నాడే దీన్ని పాండమిక్ గా పేర్కొన్నారు. దేశాలు ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని, ఈ వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిజానికి జనవరిలోనే కరోనావైరస్ గురించి తెలిసినప్పటికీ,, బహుశా చైనాకు అనుకూలంగా ఈయన ఆ విషయాన్ని తొక్కిపెట్టారని యూఎస్ సహా పలు దేశాలు ఆరోపించాయి. ట్రంప్ అనేక సందర్భాల్లో ఈ ఆరోపణ చేశారు.

ఏప్రిల్ 15 : కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యంపై కలకలం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మిస్సింగ్ వార్త పెద్ద కలకలాన్ని సృష్టించింది. హఠాత్తుగా ఆయన కనిపించడం లేదంటూ ప్రపంచ వార్తలు పతాకశీర్షికలకెక్కాయి. ఈ నెల 11 న ఆయన పబ్లిక్ గా కనిపించాడని, ఆ తరువాత అదృశ్యమయ్యాడని నార్త్ కొరియా స్వయంగా పేర్కొంది. అసలు ఆయన అస్వస్థుడయ్యాడని ఒక రోజున, మరణించాడని మరో రోజున ఇలా విభిన్న వార్తలు వచ్చాయి. అయితే దాదాపు నెల రోజుల అనంతరం మే 6 న కిమ్ తమ దేశంలో ఓ ఎరువుల ఫాక్టరీ ప్రారంభోత్సవానికి తన సోదరితో సహా వఛ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తమ దేశంలో కోవిడ్ 19 అదుపునకు కృషి చేస్తున్నవారికి, దేశ రక్షణకు పాటు పడుతున్న సైనికులకు తాను ఏమీ చేయలేకపోతున్నానని కంట తడి పెట్టాడు.  ఆయనతో బాటు అక్కడి సాయుధ దళాలు, ఆయన సన్నిహితులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

మే 25 : అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య పెను దుమారం రేపింది. మినియా పొలీస్ లో పోలీసులు ఇతడిని దారుణంగా హతమార్చారు. అతని గొంతుపై కాలితో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపారు. ఈ ఘటనతో యూఎస్ లో దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, అల్లర్లు ప్రారంభమయ్యాయి. నల్ల జాతీయులను రక్షించాలంటూ బ్లాక్ లైవ్స్ మూవీ మెంట్ ప్రారంభమయింది. ఆందోళనకారులు అనేక నగరాల్లో పోలీసులతో  ఘర్షణకు దిగారు. వేలమందిని పోలీసులు అరెస్టు చేశారు. డెన్వర్, మినియాపోలిస్, ఓక్లాండ్, న్యూయార్క్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాలు వీరి ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి.

మే 30 : ఫ్లాయిడ్ మృతికి కారకుడైన పోలీసు అధికారి అరెస్ట్

జార్జి ఫ్లాయిడ్ మృతికి కారకుడైన డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారిని అరెస్టు చేశారు. అతనిపై హత్యాభియోగం మోపారు. ఫ్లాయిడ్ మెడపై తన కాలితో 9 నిముషాలు నొక్కిపెట్టి అతని మృతికి కారకుడయ్యాడని ఇతనిపై అభియోగం దాఖలైంది. కేవలం చిల్లర నేరానికి పాల్పడిన ఫ్లాయిడ్ ను దారుణంగా హతమార్చాడని బ్లాక్ లైవ్స్ మూవ్ మెంట్ ఆందోళనకారులు ఇతడిని దుయ్యబట్టారు.

జూన్ 30 : హాంకాంగ్ పై పెత్తనానికి చైనా యత్నం

హాంకాంగ్ పై ఆధిపత్యానికి చైనా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధికారికంగా చైనా పార్లమెంట్ జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం కింద హాంకాంగ్ లో తమ దేశానికి ఎవరు వ్యతిరేకంగా నిరసనలు, ప్రదర్శనలు చేసినా వారిని చైనా అధికారులు తక్షణమే అరెస్టు చేయవచ్చు ఆందోళనలను నిర్దాక్షిణ్యంగా అణచివేయవచ్చు. అవసరమైతే తమ సైన్యాన్ని కూడా రంగంలోకి దింపవచ్చు. . అలాగే చైనా వాణిజ్య కార్యకలపైనా చైనా ఆధిపత్యం ఉంటుంది. ఈ చట్టాన్నిచైనా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

జూన్ 9 : హాంకాంగ్ లో భారీ నిరసన ప్రదర్శనలు

తమపై చైనా పెత్తనాన్ని సహించబోమంటూ హాంకాంగ్ లో భారీ ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలకు దిగారు. సుమారు రెండు లక్షలమందికి పైగా ప్రజలు పాలకమండలి విధించిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు.చైనా తెచ్చిన భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ ప్లకార్డులు, నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. అనేక చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం,వాటర్ క్యానన్లను వినియోగించారు. వేలమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. కొన్ని నెలలపాటు ఈ ఆందోళనలు, భారీ ర్యాలీలు జరిగాయి. చైనా వైఖరిపై అమెరికా మండిపడింది. అవసరమైతే తమ సైన్యాన్ని రంగంలోకి దింపుతామన్న డ్రాగన్ కంట్రీ వైఖరిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హాంకాంగ్ బాధితులకు ఆశ్రయం కల్పిస్తామన్న బ్రిటన్ సాయానికి చైనా అభ్యంతరం తెలిపింది.

ఆగస్టు 4 : లెబనాన్ లో భారీ పేలుడు

లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన భారీ పేలుడులో రెండు వందలమందికి పైగా మరణించగా ఆరు వేలమందికి పైగా గాయపడ్డారు. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మూడు లక్షలమంది నిరాశ్రయులయ్యారు. టన్నుల కొద్దీ నిల్వ ఉన్న అమోనియం నైట్రేట్ పేలిపోయిన కారణంగా ఈ  ఘోర దుర్ఘటన జరిగింది. లెబనాన్ ప్రభుత్వం రెండు వారాల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది.  బీరూట్  ఘటనలో లో నిరాశ్రయులైనవారికి ఆశ్రయం కల్పిస్తామని అమెరికా వంటి దేశాలు ముందుకు వచ్చాయి. లెబనాన్ కు ఆర్ధిక సాయం అందజేస్తామని పలు దేశాలు ప్రకటించాయి.

ఆగస్టు 28 : ” బ్లాక్ పాంథర్ ‘మూవీ నటుడు చాద్ విక్ బోస్ మన్ మృతి

బ్లాక్ పాంథర్ మూవీ నటుడు చాద్ విక్ బోస్ మన్ 43 ఏళ్ళ వయస్సులో మృతి చెందాడు.  క్యాన్సర్ కి గురైన ఈ నటుడు లాస్ ఏంజిలిస్ లో కన్ను మూశాడు. ఆస్కార్ లో ఉత్తమ చిత్రం కేటగిరీలో బ్లాక్ పాంథర్ నామినేషన్ కి ఎంపికయింది. కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్ ఎండ్ గేమ్  ఇతడ్ని పాపులర్ నటుడిని చేశాయి.  ఇతని మరణానికి హాలీవుడ్ తీవ్ర సంతాపం ప్రకటించింది.

అక్టోబర్ 2 :అమెరికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలనియా ట్రంప్ కరోనా బారిన పడ్డారు. వారికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెల్లడైంది. అయితే ఆ తరువాత మెలనియా కు నెగెటివ్ అని తేలింది. ట్రంప్ ఆసుపత్రిలో మూడు నాలుగు రోజులపాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ తననేమీ చేయలేదని మొదట చాటుకున్న ట్రంప్ చివరికి దీని ఎఫెక్ట్ అనుభవించక తప్పలేదు.  ముఖానికి మాస్క్ ధరిస్తూ వచ్చ్చారు. అయితే లాక్ డౌన్ వంటి వాటివల్ల ప్రయోజనం లేదన్న తన వైఖరికి మాత్రం అయన కట్టుబడే ఉన్నారు.

నవంబరు 3 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు శ్రీకారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థిగా జో బైడెన్ , ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ క్యాండిడేట్ కమలా హారిస్ రఁగంలో నిలిచారు. అమెరికాలొనీ వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలు మెల్లగా ఓటర్ల హడావుడితో సందడి  సంతరించుకోవడం ప్రారంభమైంది. ట్రంప్, బైడెన్ మధ్య పరోక్ష పోరులో భాగంగా పోటాపోటీగా ఓట్లు పోలవుతూ వచ్చాయి.అయితే ఆరిజోనా, జార్జియా వంటి రాష్ట్రాల్లో మెల్లగా ట్రంప్ కన్నా జో బైడెన్ కి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రమాదాన్ని ట్రంప్ సరిగా అంచనా వేయలేక విఫలమయ్యారన్న డెమొక్రాట్ల ప్రచారం ఆయన ఓట్ల శాతం తగ్గడానికి కారణమైంది.

నవంబరు 25 : ఫుట్ బాల్ లెజెండ్ డీగో మారడోనా మృతి

ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ డీగో మారడోనా ఆర్జెంటీనాలో మృతి చెందాడు. 60 ఏళ్ళ డీగో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. ఇతని మృతితో బ్యూనోస్ ఎయిర్స్ శోక సంద్రమైంది. అయితే కిడ్నీ, లంగ్స్ రుగ్మతల కారణంగా అనేక రోజులపాటు చికిత్స పొందినా ప్రయోజనం లేకపోయిందని, చివరకు ఈ వ్యాధుల తోనే మరణించాడని  కూడా వార్తలు వచ్చాయి.  ఇతని మృతి ఫుడ్ బాల్ క్రీడాకారుల్లో పెను విషాదాన్ని నింపింది. తన క్లయింట్ మరణంపై విచారణ జరిపించాలని డీగో తరఫు లాయర్ డిమాండ్ చేశారు.

డిసెంబరు 5 : అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నిక

దాదాపు నెల రోజుల ఓట్ల లెక్కింపు అనంతరం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికైనట్టు ప్రకటించారు. ఎలెక్టోరల్ కాలేజ్ లో ఆయనకు 306 ఓట్లు రాగా, అధ్యక్షుడు ట్రంప్ 232 ఓట్లు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా బైడెన్ మొత్తం 8,268,867 ఓట్లు, ట్రంప్ 74,216,747 ఓట్లు సాధించారు. బైడెన్ ఓట్ల శాతం 51.3 కాగా..ట్రంప్ ఓట్ల శాతం 46.9 ఉంది. ఈ నెల 9 న ప్రతి రాష్ట్ర ఎన్నికల ఫలితాలను సర్టిఫై చేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులకు ఓటర్లు ఈ నెల 14 న లాంఛనంగా ఓట్లు వేశారు. జనవరి 6 న వీరి ఓట్లను కాంగ్రెస్ అధికారికంగా లెక్కించనుంది. జనవరి 20 న జో బైడెన్ అధ్యక్షునిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా పదవులు చేపట్టనున్నారు. అధికారం నుంచి ట్రంప్ వైదొలగనున్నారు.

అయితే ఈ ఎన్నిక ఫ్రాడ్ అని, మళ్ళీ ఓట్ల లెక్కింపు జరగాలని ట్రంప్ పట్టుబడుతుండడమే విశేషం. బైడెన్ ఎన్నికను, తన ఓటమిని సవాలు చేస్తూ ఆయన పలు రాష్ట్రాల కోర్టుల్లో దావాలు వేశారు. సుప్రీంకోర్టుకు కూడా ఎక్కారు. కానీ ఆయన ఓటమిని కోర్టులు ధృవీకరించాయి. ఏమైనా తను వైట్ హౌస్ ను వీడేది లేదని ట్రంప్  భీష్మించుకుని కూర్చున్నారు. ఒక దశలో తన ఓటమిని అంగీకరించినా ఆ తరువాత  వాషింగ్టన్ లో తన మద్దతుదారులు జరిపిన భారీ ర్యాలీతో ఆయన తిరిగి  పాత  పాట పాడడం విడ్డూరం.