నేడు మోదీతో దీదీ భేటీ… సడన్‌గా ఈ ఛేంజ్ ఏంటి..?

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ అన్నా.. బీజేపీ అన్నా.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. అంతేకాదు. బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటే.. ఏకంగా అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. దాదాపు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లకు దీదీ చుక్కలు చూపించింది. వారు ఎన్నికల ప్రచారానికి వేళ్లేందుకు సిద్ధమవుతుంటే.. వారికి ల్యాండింగ్‌ అయ్యేందుకు చాపర్‌లకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేది […]

నేడు మోదీతో దీదీ భేటీ... సడన్‌గా ఈ ఛేంజ్ ఏంటి..?
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 6:23 AM

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ అన్నా.. బీజేపీ అన్నా.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. అంతేకాదు. బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటే.. ఏకంగా అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. దాదాపు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లకు దీదీ చుక్కలు చూపించింది. వారు ఎన్నికల ప్రచారానికి వేళ్లేందుకు సిద్ధమవుతుంటే.. వారికి ల్యాండింగ్‌ అయ్యేందుకు చాపర్‌లకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేది లేక.. రోడ్డు మార్గానే ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీజేపీ అంటే అదే స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని రెండో సారి విజయం సాధించి ప్రమాణస్వీకారాని ఆహ్వానిస్తే కూడా వెళ్లలేదు. రాష్ట్రంలో టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారడంతో రాజకీయ హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. అయినా కూడా దీదీ ఏమాత్రం తగ్గలేదు. కేంద్రంపై కయ్యానికి సై అన్నట్లు వ్యవహరించారు ఇన్నాళ్లు. అయితే సడన్‌గా దీదీ మోదీతో భేటీ అవుతుండటంతో రాజకీయ నేతల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తన మేనళ్లుడు శారద చిట్ ఫండ్ స్కాంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్కాం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో.. రాష్ట్రంలోకి సీబీఐకి నో ఎంట్రీ అంటూ బోర్డు తగిలించారు దీదీ. శారదా చిట్ ఫండ్ కుంబకోణంలో విచారణాధికారిగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారిని విచారించేందుకు సీబీఐ అధికారులు వెళితే.. నా అనుమతి లేకుండా ఎంక్వైరీ చేస్తారా అంటూ వారిపై దాడికి పాల్పడినంత పనిచేశారు. అంతేకాదు దీదీ వర్గం ఏకంగా దాడికి యత్నించారు. అయితే ఆ తర్వాత దీదీ బ్లాక్ డే అంటూ నిరిసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ తర్వాత ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ సందర్భంలో దీదీ తన సోదరి అని.. ప్రతి ఏటా తనకు కుర్తా, స్వీట్లు పంపిస్తారని మోదీ అన్నారు. అయితే ఈ సారి రాళ్లు, కంకరతో చేసిన స్వీట్లు పంపిస్తానంటూ ప్రతి విమర్శలు చేశారు. అయితే తాజాగా మంగళ వారం మోదీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. అందుకు ప్రధాని మోదీ కూడా ధన్యవాదాములు దీదీ అంటూ రిప్లై ఇచ్చారు.

అయితే ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీతో మమత భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంత సడన్‌గా దీదీ మీట్ అవుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీదీ మాత్రం ఈ సమావేశం అత్యంత సాధారణ విషయమేనని చెప్పారు. తామిద్దరమూ దేశం కోసం పని చేసేందుకు కలవబోతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని కలవండం రాజ్యాంగపరమైన బాధ్యత అని, మర్యాదపూర్వకమైనదని వివరించారు. మోదీతో తాను చర్చించబోయే అంశాలను ముందుగానే వెల్లడించడం సరికాదన్నారు.

అయితే పశ్చిమ బెంగాల్ పేరు మార్పు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంపై చర్చించేందుకే మోదీ వద్దకు వెళుతున్నానని దీదీ వర్గాలు చెబుతున్నా.. ఆ విషయాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు. అయితే అదే సమయంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీదీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. శారదా చిట్ ఫండ్ కేసుతో పాటు.. మరిన్ని కేసుల్లో కూడా మమత ఇరుక్కున్నారని.. అయితే తనను తాను రక్షించుకునేందుకే మోదీ వద్దకు బేరానికి వెళుతున్నారంటూ అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నారు. ఏదేమైనా.. ఇవాళ జరగబోయే మోదీ, దీదీ భేటీ మాత్రం ప్రాదాన్యత సంతరించుకుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు