జల్లికట్టు చిత్రం ఆస్కార్ ఎంట్రీకి ఎందుకు నోచుకుందంటే ? మానవ అంతర్లీన సంబంధాలనూ చూపినందుకా ?
మలయాళ దర్శకుడు లిజో జోస్ పెలిసెరి డైరెక్ట్ చేసిన 'జల్లికట్టు' చిత్రం 93 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ లాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికయింది. 14 మంది సభ్యులతో కూడిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ విషయాన్ని..
మలయాళ దర్శకుడు లిజో జోస్ పెలిసెరి డైరెక్ట్ చేసిన ‘జల్లికట్టు’ చిత్రం 93 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ లాంగ్వేజ్ కేటగిరీకి ఎంపికయింది. 14 మంది సభ్యులతో కూడిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఇందులోని విశేషాలను క్లుప్తంగా వివరించింది. రెచ్చి పోయిన ఓ ఎద్దు ను స్లాటర్ హౌస్ (కబేళా) కు తరలిస్తుండగా అది యజమాని నుంచి తప్పించుకుని పోయి కేరళ లోని ఇదుక్కి జిల్లాలో ఎలాంటి విన్యాసాలను చూపిందన్నది ఈ చిత్రం థీమ్ అని ఈ కమిటీ పేర్కొంది. మానవ అంతర్లీన సంబంధాలను స్పష్టం చేస్తూ.. వేర్వేరు లొకేషన్లలో సినిమా లో చితీకరించిన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయని ఈ కమిటీ చైర్ పర్సన్ రాహుల్ రానైల్ వెల్లడించారు. ఇందులోని క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ తమకు నచ్చాయన్నారు. ఈ చిత్ర నిర్మాణ విలువలు అమోఘం అన్నారు.
ఈ కమిటీ మొత్తం 27 చిత్రాలను చూసింది. షూజిత్ సర్కార్ మూవీ..గులాబో సితాబో, నప్లద్ రెహమాన్ చిత్రం..చిప్పా, హన్సల్ మెహతా సినిమా..చాలాంగ్, విధు వినోద్ సినిమా..షికారా వంటి మూవీలను చూసినట్టు రాహుల్ చెప్పారు. గతంలో రీమా దాస్ చిత్రం విలేజ్ రాక్ స్టార్స్, వెట్రి మారన్ మూవీ విసర్జన లాంటి సినిమాలను ఎంట్రీ కోసం పంపినప్పటికీ అవి ఆస్కార్ బరిలో నిలవలేదు. కాగా వచ్ఛే ఏడాది ఏప్రిల్ 25 న లాస్ ఏంజిలిస్ లో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.