లండన్‌లో రోడ్డుపాలై 29,000 కిలోల క్యారెట్లు..!
అసలే కూరగాయల ధరలు అకాశాన్నంటుతున్నాయి. మరోవైపు కరోనా పుణ్యామాని సామాన్యుడు ఆర్థిక భారంతో సతమతమవతున్నాడు. ఇలాంటి సమయంలో రోడ్డు మీద కూరగాయలు పారబోశాడు ఓ వ్యక్తి.
అసలే కూరగాయల ధరలు అకాశాన్నంటుతున్నాయి. మరోవైపు కరోనా పుణ్యామాని సామాన్యుడు ఆర్థిక భారంతో సతమతమవతున్నాడు. ఇలాంటి సమయంలో రోడ్డు మీద కూరగాయలు పారబోశాడు ఓ వ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29,000 కిలోల క్యారెట్లను రోడ్డు పాలు చేశాడు. ఏ సీజన్‌లో అయినా క్యారెట్లకు మంచి గిరాకీ ఉంటుంది. వాటి వల్ల రైతులు ఎప్పుడూ నష్టపోరు. అలాంటిది 29 టన్నుల క్యారెట్లను ఎందుకు రోడ్డు మీద పడేశారో తెలియక జనం తలలు పట్టుకున్నారు. క్యారెట్ల గుట్టను తమ సెల్ ఫోన్ల బంధించి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఇది ఎక్కడా అని ఆరా తీస్తే దక్షిణ లండన్‌లోని గోల్డ్ స్మిత్స్ కాలేజీ ముందు అని అర్థమైంది. లారీ ద్వారా తీసుకువచ్చిన 29,000 కిలోల క్యారెట్లను రోడ్డు మీద వేశారు. నెటిజన్ల ట్రోల్ కు వారి సంధించే ప్రశ్నలకు గోల్డ్ స్మిత్స్ కాలేజీ స్పందించింది.
carrots at goldsmiths. Carrots at goldsmiths pic.twitter.com/SQKtduu7ms
— gaucho trap house (@fromscratch11) September 30, 2020
ఈ క్యారెట్లు ఒక స్టూడెంట్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో భాగమని వివరణ ఇచ్చుకున్నారు. కళాశాల ఎమ్ఎఫ్ఏ డిగ్రీ ప్రదర్శనలో భాగంగా ఇలా క్యారెట్ల షో అని కాలేజీ మేనేజ్ మెంట్ క్లారిటీ ఇచ్చింది. ‘ఈ సంస్థాపనను ఆర్టిస్ట్, ఎమ్ఎఫ్ఏ విద్యార్థి రాఫెల్ పెరెజ్ ఎవాన్స్ ‘గ్రౌండింగ్’ అని అంటారు. ప్రదర్శన తర్వాత క్యారెట్లను తొలగించి జంతువులకు దానం చేస్తారని సమాచారం. కళ్ల ముందు కనిపిస్తున్న క్యారెట్లను చూసి ఉండలేని కొందరు విద్యార్థులు క్యారెట్లను ఇంటికి కూడా తీసుకెళ్లారు.