మోదీ పాదాభివందనం!

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే పక్ష నేతలు పాల్గొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఐతే వారందరికీ నమస్కరించిన ప్రధాని మోదీ..ప్రకాశ్ సింగ్ బాదల్‌‌కు అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చారు. వయసులో తనకన్నా 23 ఏళ్లు […]

మోదీ పాదాభివందనం!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 11:54 AM

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే పక్ష నేతలు పాల్గొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఐతే వారందరికీ నమస్కరించిన ప్రధాని మోదీ..ప్రకాశ్ సింగ్ బాదల్‌‌కు అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చారు. వయసులో తనకన్నా 23 ఏళ్లు పెద్దవారైన ప్రకాశ్ బాదల్‌ (91) కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

అంతేకాదు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన అన్నపూర్ణ శుక్లాకు కూడా మోదీ నమస్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాతే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, ప్రధాని మోదీ పాదాభివందనం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ చేసిన పనిని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకు అధికార గర్వం లేదని…ప్రధానినన్న అహం అస్సలే లేదంటూ తెగ పొగడుతున్నారు.