AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉందని మీకు తెలుసా ?

అతిబల మొక్క, భారతీయ సంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో జ్వరం, దగ్గు, కీళ్లనొప్పులు, కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ వ్యాధులు, నడుము నొప్పి వంటి 100కు పైగా రోగాలను నయం చేయగలదని ఆయుర్వేదం చెబుతుంది.

100 రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉందని మీకు తెలుసా ?
Atibala Plant Benefits
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2026 | 6:54 PM

Share

మన చుట్టూ ఉండే ఎన్నో మొక్కలు అలివికాని మొండి రోగాలను సైతం నయం చేయగలవని చాలామందికి తెలియదు. అలాంటి అద్భుత ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో అతిబల ఒకటి. దీనిని దువ్వెన బెండ, ముద్ర బెండ, తుత్తురు బెండ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క మాల్వేసి కుటుంబానికి చెందినది. రోడ్ల పక్కన, పొలాల కంచెల వెంట విస్తారంగా కనిపించే ఈ మొక్కలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు చాలామందికి తెలియదు. అతిబల మొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది. భారతీయ సంప్రదాయ వైద్యంలో, ముఖ్యంగా తమిళ సిద్ధ వైద్యంలో, భారతీయ ఆయుర్వేదంలో దీనిలోని ప్రతి భాగాన్ని వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

ఈ మొక్క జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రనాళ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు కరిగించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లనొప్పి లేదా కీళ్లవాతం ఉన్నప్పుడు అతిబల ఆకుల పేస్ట్‌కు ఆవాల నూనె కలిపి రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రక్త మొలలు ఉన్నవారు ఆకులను ఉడికించి తింటే తగ్గుతాయని చెబుతారు. ఆడవారిలో యోని ఇన్ఫెక్షన్లు ఉంటే, దీని ఆకుల డికాక్షన్‌తో శుభ్రం చేసుకోవచ్చు. చర్మంపై వాపులు, గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు అతిబల ఆకులను పసుపుతో కలిపి పేస్ట్‌గా చేసి రాయడం వల్ల త్వరగా నయం అవుతాయి, ఎందుకంటే ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మూత్రంలో మంట, మూత్రాశయంలో రాళ్లు ఉన్నవారు అతిబల ఆకులను నీటిలో మరిగించి తేనె కలిపి త్రాగడం వల్ల రాళ్లు కరిగి, మంట తగ్గుతుంది. అతిసారం ఉన్నవారికి దీని విత్తనాల పొడితో చేసిన టీ ఔషధంలా పనిచేస్తుంది. కంటిచూపు మెరుగుపరచడానికి అతిబల ఆకుల డికాక్షన్‌తో కళ్ళు కడుక్కుంటే మంచిది. ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ, శ్వాసనాళ వాపులకు దీని మొత్తం మొక్క భాగాన్ని (పూలు, కాండం, ఆకులు, కాయలు, వేర్లు) ఉపయోగించి కషాయం కాచి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. జ్వరం తగ్గడానికి అతిబల ఆకులను నానబెట్టి, ఆ నీటికి పటికబెల్లం కలిపి త్రాగుతారు.

దంతాల ఆరోగ్యం కోసం దీని ఆకుల రసాన్ని నోటిలో ఉంచుకొని ఊసేయడం, డికాక్షన్‌తో పుక్కిలించడం వల్ల దంతాలు గట్టిపడి పంటినొప్పి తగ్గుతుంది. నడుము నొప్పి తగ్గడానికి అతిబల ఆకుల కషాయం త్రాగాలి. గౌట్, క్షయ, నోటిపూత, పేగుపూత, రక్తస్రావాలకు కూడా దీని డికాక్షన్ ఉపయోగిస్తారు. శరీరానికి బలం రావాలంటే, అతిబల మొక్క వేరును ఆవుపాలతో మరిగించి పటికబెల్లం కలిపి తీసుకోవాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. మూత్రంలో రక్తం పడటం, మూత్రనాళంలో మంట తగ్గడానికి దీని ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటారు. అతిబల ఆకుల రసాన్ని చక్కెరతో కలిపి త్రాగితే గుండె ఆరోగ్యానికి మంచిది. మగవారిలో శీఘ్రస్కలనం సమస్యకు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు దీని వేరు కషాయం ఔషధంగా పనిచేస్తుంది. అతిబల మొక్క రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఈ మొక్క ఆకులు రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

(ఈ సమాచారం ఆయుర్వేద నిపుణుల నుంచి సేకరించాం. మీకు ఎలాంటి సమస్యులన్నా వైద్యులను సంప్రదించడం మంచిది)

Also Read: గడ్డి వాము వద్ద అదే పనిగా అరుస్తున్న గిన్ని కోళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. 

Follow Us