త్వరలో కొత్త రూ.20నోటు.. చూస్తారా..!
డీమానిటైజేషన్ తరువాత దేశంలో కరెన్సీ నోట్లు కొత్త కొత్త రంగుల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్కో నోటుకు ఒక్కో రంగు కేటాయిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. త్వరలో కొత్త రూ.20నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ శుక్రవారం స్పష్టం చేసింది. ఒకవైపు మహాత్మగాంధీ బొమ్మతో రాబోతున్న కొత్త నోట్లలో.. మరోవైపు దేశ వారసత్వ సంపదలలో ఒకటైన ఎల్లోరా గుహలకు సంబంధించిన చిహ్నం ఉండబోతుంది. గ్రీనిష్ ఎల్లో రంగుతో రానున్న ఈ నోటు 63మి.మీ* 129మి.మీ కొలతలతో.. […]

డీమానిటైజేషన్ తరువాత దేశంలో కరెన్సీ నోట్లు కొత్త కొత్త రంగుల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్కో నోటుకు ఒక్కో రంగు కేటాయిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. త్వరలో కొత్త రూ.20నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ శుక్రవారం స్పష్టం చేసింది. ఒకవైపు మహాత్మగాంధీ బొమ్మతో రాబోతున్న కొత్త నోట్లలో.. మరోవైపు దేశ వారసత్వ సంపదలలో ఒకటైన ఎల్లోరా గుహలకు సంబంధించిన చిహ్నం ఉండబోతుంది. గ్రీనిష్ ఎల్లో రంగుతో రానున్న ఈ నోటు 63మి.మీ* 129మి.మీ కొలతలతో.. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనుంది.
