AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Effect: స్టాక్ మార్కెట్‌లో ‘ఏఐ’ గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!

Stock Market AI Effect: చాలా రోజుల తర్వాత అమెరికా- భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో గత 10 రోజులుగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు కాస్త సానుకూలంగా కదలాడిన సంగతి తెలిసిందే. ఇక మంచి రోజులు వచ్చాయనుకుంటే మళ్లీ..

AI Effect: స్టాక్ మార్కెట్‌లో 'ఏఐ' గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!
Stock Market Ai Effect
Subhash Goud
|

Updated on: Feb 15, 2026 | 9:07 PM

Share

Stock Market AI Effect: స్టాక్ మార్కెట్‌లో కృత్రిమ మేధ (AI) సృష్టిస్తున్న ప్రకంపన సృష్టిస్తోంది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి. గత వారంలో మన దేశానికి చెందిన టాప్ 6 కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు పైగా పడిపోయింది.

చాలా రోజుల తర్వాత అమెరికా- భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో గత 10 రోజులుగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు కాస్త సానుకూలంగా కదలాడిన సంగతి తెలిసిందే. ఇక మంచి రోజులు వచ్చాయనుకుంటే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఏఐ స్టార్టప్స్ ప్రకంపనలతో ఐటీ స్టాక్స్ కుదేలవుతున్నాయి. ఇది మార్కెట్లపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

  1. ఐటీ దిగ్గజాలకే పెద్ద దెబ్బ: ఇందులో ఎక్కువగా నష్టపోయింది ఐటీ దిగ్గజాలైన టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys). వీటితో పాటు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ఐసీ, భారతీ ఎయిర్‌టెల్ కూడా దెబ్బతిన్నాయి.
  2. లాభాల్లో ఈ రెండు మాత్రమే: మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ.. ఎస్‌బీఐ (SBI), ఐటీసీ (ITC) సంస్థలు మాత్రం తమ మార్కెట్ విలువను పెంచుకుని లాభాల్లో నిలవడం విశేషం.
  3. అసలు ఈ పతనానికి కారణం ఏంటి?: ఆంత్రోపిక్ (Anthropic) అనే సంస్థ కొత్తగా తీసుకొచ్చిన ‘ఏఐ టూల్స్’ (AI Tools) వల్లే ఈ నష్టాలు వచ్చాయి. ఈ కొత్త ఏఐ టూల్స్ లాంచ్ అయినప్పటి నుంచి ఒక్క ఐటీ రంగంలోనే రూ. 2 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
  4. ఏ కంపెనీకి ఎంత నష్టం?: టీసీఎస్ (TCS) అత్యధికంగా రూ.70,481 కోట్లు నష్టపోగా, ఇన్ఫోసిస్ రూ.54 వేల కోట్లు, హెచ్‌సీఎల్ రూ.26,800 కోట్లు కోల్పోయాయి. అలాగే టెక్ మహీంద్రా, విప్రోలకు కూడా దాదాపు పది వేల కోట్ల చొప్పున నష్టం వాటిల్లింది.
  5. ఇన్వెస్టర్ల భయం ఏంటి?: ఏఐ ఏజెంట్లు డేటా ఎంట్రీ, కాంట్రాక్ట్స్ లాంటి అవుట్‌సోర్సింగ్ పనులను క్షణాల్లో ఆటోమేటిక్‌గా చేసేస్తున్నాయి. దీంతో లక్షల మంది ఉద్యోగులతో నడిచే మన భారతీయ ఐటీ కంపెనీల వ్యాపారం ఏమైపోతుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది.
  6. గ్లోబల్ ట్రెండ్ కూడా ఇదే: దీని ప్రభావంతో నిఫ్టీ ఐటీ (Nifty IT) సూచీ ఏకంగా 8.3 శాతం (3 వేల పాయింట్లు) పడిపోయింది. కేవలం మన దగ్గరే కాదు.. గ్లోబల్ కంపెనీలైన యాక్సెంచర్ (Accenture), కాగ్నిజెంట్ కూడా 6 నుంచి 10 శాతం మేర నష్టపోయాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి